చాణక్య నీతి: పెళ్లి చూపుల‌కు వెళుతున్న యువ‌కులు గుర్తించుకోవాల్సిన అంశాలివే..

పెళ్లికి అమ్మాయిని చూసేందుకు వెళ్లేటప్పుడు యువకులు ఎలా ప్రవర్తించాలో ఆచార్య చాణక్య తెలిపారు.భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరైన ఆచార్య చాణక్యుడు తాను రూపొందించిన నీతిశాస్త్రం పరంగా ఎంతో ప్రసిద్ధి చెందాడు.

 Do Not Do These Mistake While Choosing A Girl For Marriage Details, Acharya Chan-TeluguStop.com

చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడి విధానాల బలంతోనే మగధ చక్రవర్తి కాగలిగాడు.

ఆచార్య చాణక్య జీవన విధానాన్ని రూపొందించాడు.అందులో అతను సమాజంలోని అన్ని విషయాలకు సంబంధించి సూచనలు చేశాడు.

వివాహం విషయానికొస్తే సంస్కారవంతమైన జీవిత భాగస్వామి లభించడాన్ని గొప్ప అదృష్టంగా పేర్కొన్నాడు.యువకుల పెళ్లి చూపులకు వెళ్లే సందర్భంలో ఎలా మెలగాలో కూడా చాణక్య తెలియజేశారు.
1.చాణక్య నీతి ప్రకారం స్త్రీ అందాన్ని చూసి, వివాహం నిశ్చయించుకోవడం పెద్ద తప్పు కావచ్చు.వివాహానికి, బాహ్య సౌందర్యం కంటే ఆమె సుగుణాలు ముఖ్యం.అందం కంటే స్త్రీకి సంస్కృతి, విద్య ఉన్నతిని అందిస్తాయి.
2.ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం పురుషుడితో పాటు స్త్రీకి కూడా మతపరమైన ఆచారాలపై నమ్మకం ఉండాలి.

పెళ్లి చూపులకు అమ్మాయిని చూసేందుకు వెళ్లేటప్పుడు, ఆ యువతి మతపరమైన నమ్మకాలను కలిగివుందో లేదో తెలుసుకోవాలి.

Telugu Beautiful, Chanakya Neeti, Groom, Proposals, Marrigae-General-Telugu

3.చాణక్య నీతి ప్రకారం తన స్వంత ఇష్టానుసారం వివాహం చేసుకోని వ్యక్తి ఎన్నటికీ సుఖంగా ఉండలేడు.ఎందుకంటే నచ్చని జీవిత భాగస్వామి భవిష్యత్తులో సంతోషాన్ని లేదా గౌరవాన్ని అందించలేదు.ఒత్తిడితో వివాహం చేసుకోవడం వైవాహిక జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది.
4.మధురంగా ​​మాట్లాడే స్త్రీ ఉండే ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుందని ఆచార్య చాణక్య తెలిపాడు.అందుకే ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడాలి.

చక్కగా మాట్లాడే స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి విధి చక్కగా మారుతుందని చాణక్య తెలిపారు.అలాంటి స్త్రీ ఉన్నప్పుడు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా రూపొందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube