లవ్ మ్యారేజ్ కే నా ఓటు..!

నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రుక్సర్ ధిల్లన్ ఆ సినిమాతో పర్వాలేదు అనిపించగా ఆ తర్వాత వరుస ఛాన్సులు అందుకుంటుంది.లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటిస్తుంది రుక్సర్.

 Rukshar Dhillan Love Marriage Details, Love Marriage, Rukshar Dhillan, Vishwak S-TeluguStop.com

ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని చెబుతుంది అమ్మడు.అంతేకాదు సినిమా చాలా బాగా వచ్చిందని ఫ్యామిలీ ఆడియెన్స్ ని సినిమా ఆకట్టుకుంటుందని అంటుంది.

ఇక తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ తను పెళ్లంటూ చేసుకుంటే లవ్ మ్యారేజ్ నే చేసుకుంటా అని అంటుంది.

తమ ఫ్యామిలీలో అందరు లవ్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉన్నారని.

అందుకే తను కూడా ప్రేమ పెళ్లినే చేసుకుంటానని అంటుంది రుక్సర్.తనని బాగా అర్ధం చేసుకుని తన కెరియర్ కి సపోర్ట్ చేసే అతన్ని ప్రేమించి పెళ్లాడుతా అంటుంది అమ్మడు.

మొత్తానికి రుక్సర్ ప్లానింగ్ బాగానే ఉందని చెప్పొచ్చు.మోడల్ గా చేస్తూ సినిమాల్లో ఛాన్స్ అందుకున్న ఈ అమ్మడికి హీరోయిన్ గా మరింత పాపులారిటీ రావాలని బాగా ట్రై చేస్తుంది.

 రానున్న సినిమాలైనా అమ్మడికి లక్ కలిసి రావాలని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube