నాంపల్లిలో ఉద్యోగుల సంఘ భవన స్థలం అక్రమణ

నల్లగొండ జిల్లా: నాంపల్లి మండల కేంద్రంలో పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గంజి వెంకటేశ్వర్లు గ్రామ పాలనను గాలికొదిలేసి అక్రమ ఆక్రమణలకు అండగా ఉంటున్నారని,"పంచాయితీ కార్యదర్శికి పైసా కొట్టు.

ఏ స్థలమైనా సరే కబ్జా పెట్టు"అనే చందంగా ఆయన వ్యవహారశైలి ఉందని ఉద్యోగ సంఘం నేత గేర నరసింహ ఆరోపిస్తున్నారు.

నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఇరవై ఏళ్ల క్రితం ఉద్యోగుల భవనం కొరకు 360 గజాల భూమిని ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేశామని,విధినిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో భవన నిర్మాణం చేపట్టలేదన్నారు.ఇదేఅదునుగా భావించిన కొందరు అక్రమార్కులు గత 15 ఏళ్ల క్రితమే గ్రామపంచాయతీ ద్వారా ఈ స్థలాన్ని అక్రమ పట్టా చేసుకొని అందులో ప్రస్తుతం అక్రమంగా నిర్మాణం మొదలుపెట్టారని,విషయం తెలుసుకున్న ఉద్యోగులు కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా ఆనాటి కార్యదర్శిని సస్పెండ్ చేశారని,ఆ స్థలం విషయంలో కోర్టును కూడా ఆశ్రయించిన ఆశ్రయించామని,ఆ వివాదం కోర్టులో నడుస్తుండగానే మళ్ళీ భవన నిర్మాణ పనులకు ఇప్పటి పంచాయితీ కార్యదర్శి పర్మిషన్ ఇచ్చారని,దాంతో అందులో మళ్ళీ అక్రమ నిర్మాణం మొదలుపెట్టారని,ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

In Nampally The Site Of The Employees Union Building Illegal Aquisition, Nampal

మండల కేంద్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం ఉన్నాయని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Latest Nalgonda News