పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు 5 లక్షల చోరీ..!

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండల( Damercherla ) కేంద్రంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.

భోజనం కోసం ఓ రెస్టారెంట్ ఎదుట నిలిపి ఉంచిన కారు అద్దాలు పగలగొట్టి 5 లక్షల సొత్తు ఎత్తుకెళ్లిన ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్లకు చెందిన అజ్మీర మాలు,పడిగపాటి వెంకటరెడ్డి,బి.రామారావు, కె.

In Broad Daylight, Angry Thieves Stole 5 Lakhs , Damercherla , Nalgonda District

లక్ష్మణ్,రమేష్ రియల్ ఎస్టేట్ మిత్రబృందం తమ ప్లాటును విక్రయించారు.కొనుగోలు చేసిన వ్యక్తికిబుధవారం మిర్యాలగూడ( Miryalaguda ) రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసి,డబ్బులు తీసుకుని కారులో తిరిగి ఇంటికి వెళుతూ దామరచర్ల శివారులో ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్ళారు.

ఇదే అదునుగా భావించిన దొంగలు కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల నగదున్న బ్యాగును తీసుకొని బైక్ పై ఉడాయించారు.ఇది గమనించిన రెస్టారెంట్ సిబ్బంది కేకలు వేయగా అప్పటికే దుండగులు వెళ్ళిపోయారు.

Advertisement

వెంటనే రెస్టారెంట్ వద్ద గల సిసి ఫుటేజ్ లను పరిశీలించగా దొంగతనం జరిగిన తీరు రికార్డయింది.బాధితులు రిజిస్ట్రేషన్ ఆఫీస్( Registration Office ) వద్ద పరిశీలించగా అదే దుండగులు ఆ ప్రాంతంలో తచ్చాడుతూ కనిపించారని,తమను అక్కడ నుండే కనిపెడుతూ ఉన్నారని, కారులో బయలుదేరినప్పటి నుండి అనుసరిస్తూ వచ్చి అతను రెస్టారెంట్ లోకి వెళ్ళింది చూసి డబ్బులు ఎత్తుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటనపై వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.

Advertisement

Latest Nalgonda News