బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ కాదా..?

బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనేది ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా చర్చించుకుంటున్న విషయం.బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కేసీఆర్ ( KCR ) కూర్చున్నారు.

 If The Brs Party Comes To Power, The Cm Will Not Be Kcr , Brs , Cm Kcr , Revant-TeluguStop.com

అయితే గత కొన్ని రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని, కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కి సీఎం పదవి బాధ్యతలు అప్పగించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అయ్యారు అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాదు జాతీయ రాజాకీయాల్లో చక్రం తిప్పడం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు.అయితే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ ( KTR ) సీఎం అవుతారు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.అయితే తాజాగా సీఎం పదవి పై సంచలన విషయాన్ని బయటపెట్టారు కేటీఆర్.

ఆయన మాట్లాడుతూ.చాలా రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం నేనే అవుతానని అందరూ మాట్లాడుకుంటున్నారు.ఇక బీఆర్ఎస్ పార్టీలో సీఎం పీఠంపై కూర్చునే అర్హత సమర్థత కలిగినవారు ఎంతోమంది ఉన్నారు.కానీ బీఆర్ఎస్ పార్టీ సీఎం మాత్రం కెసిఆర్ ( KCR ) గారే.

నేను సీఎం అవుతాను అని చాలా మంది ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారు.ఇక ప్రతిపక్షాలకు నేను సీఎం అవ్వాలని చాలా ఆశ ఉంది.వారికి నాపై ప్రేమ బాగానే ఉంది అందుకే నేనే సీఎం అవ్వాలని అనుకుంటున్నారు.అంటూ సీఎం పదవి పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube