ఈ సీ-లయన్ పెద్ద చేప కావాలని ఎలా అడుక్కుంటుందో చూస్తే ఫిదా అవుతారు..

జంతువులే కాదు నీటిలో బతికే జీవులు కూడా చాలా తెలివిని ప్రదర్శిస్తాయి.డాల్ఫిన్లు కుక్కలకు సమానమైన తెలివిని కలిగి ఉంటాయి.

 How This Sea-lion Begs For A Big Fish Video Viral Details, Viral News, Latest Ne-TeluguStop.com

అవి మనుషులతో ఇంట్రాక్ట్ అవుతూ చాలా ఆకట్టుకుంటాయి.వీటి తర్వాత మనుషులతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవి సీ లయన్స్.

( Sea Lions ) ఇవి ఆహారం అందించాలంటూ మనుషులను అడుగుతాయి.వీటిని కొంతమంది పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు.

తాజాగా ఒక స్మార్ట్ సీ-లయన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక బోటు ( Boat ) సముద్రంలో దూసుకు వెళ్లడం మనం చూడవచ్చు.ఆ బోటు వెనక భాగం పైకి ఒక సీ-లయన్ ఎక్కడం కూడా మనం గమనించవచ్చు.అది బోటులో ఉన్న ఒక వ్యక్తి వైపు దీనంగా చూస్తూ ఉంది.దానికి ఆహారం కావాలేమో అని సదరు వ్యక్తి మొదట తాను పట్టిన ఒక చేపలలో చిన్న చేపను ( Small Fish ) తీసి దాని ముందు ఉంచాడు.

అయితే సీ-లయన్ అది తనకి అసలు వద్దే వద్దు అని, వేరే పెద్ద చేప( Big Fish ) కావాలని అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.దాంతో వ్యక్తి మరొక పెద్ద చేపని తీసి ఇచ్చాడు.

అది చూసి సంతృప్తి పడి, సంతోష పడి వెంటనే తన నోట కరుచుకుని సీ-లయన్ బోట్ పై నుంచి కిందకి దూకి నీళ్లలో పడి వెళ్ళిపోయింది.

@TheFigen_ ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది దీనికి ఇప్పటికే ఒక కోటి తొమ్మిది లక్షల వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసి చాలామంది ఇంటర్నెట్ యూజర్లు నవ్వుకుంటున్నారు.తమ కుక్క కూడా చిన్న ట్రీట్ ఇస్తే తీసుకోదని, పెద్ద ట్రీట్ కావాలని మారం చేస్తుందని ఒక వ్యక్తి పేర్కొన్నాడు.“స్మార్ట్ గా ఈ సీ లయన్ బోట్ రైడ్ చేయడమే కాక ఎలాంటి వేట చేయకుండా పెద్ద చేపను పట్టేసింది, ఇది చాలా తెలివైనది.” అని మరొక వ్యక్తి అన్నాడు.సార్ నేను ఏమి ఫూల్ ని కాదు మీరు ఫ్రిడ్జ్ లో పెద్ద చేపలు పెట్టారని నాకు తెలుసు అని అన్నట్లు ఈ జలచరం భలేగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిందని ఇంకొకరు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube