నల్లగొండ జిల్లా:దొంగ నోట్లు,దొంగ ఓట్లతో ఇంకెంతకాలం రాజ్యమేలుతారు? దోపిడి రాజకీయ పార్టీలకు ప్రజానేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రశ్నతో కూడిన పోరు లేఖ.
justice Association for India(JAI), మరియు Bharat organization for Revolutionari awakening (B O R A) లాంటి ప్రజా సంఘాలు సమగ్ర ఎన్నికల సంస్కరణల కోసం చేస్తున్న పోరాటం అభినందనీయం.
మనదేశంలో ఇటీవల జరుగుతున్న ఎన్నికలు పరాకాష్ఠకు చేరిన ఎన్నికల ప్రహసనానికి అవి అద్దం పడుతున్నాయని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.మనదేశంలో ఎన్నికల ప్రక్రియ ఎప్పుడో అర్థ,అంగబల సంపన్నుల క్రీడాంగణంగా మారిపోయిందని ప్రజాస్వామికవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తీవ్రమైన దుఃఖాన్ని వెలిబుచ్చుతున్నారు.
ఓటుకు ఒక్క రూపాయి చొప్పున పంచిన రోజుల నుంచి ఐదు వేలనుండి 10 వేల వరకు వేల రూపాయల వరకు వెదజల్లుతున్న నేటి మనీగోడ్ ఉప ఎన్నికల వరకువరకు అధికార,ప్రతిపక్షనాయకుల నిర్వాకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ప్రజాతంత్రవాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల చట్టాలను చాపచుడుతున్న నేతల చేతలకు నిర్వాచన్ సదన్ మౌన ప్రేక్షకురాలిగా మిగిలిపోతోందని ప్రజానేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
ఈసీ నిర్దేశించే గరిష్ఠ వ్యయపరిమితి-ప్రధానఎన్నికల్లో రాజకీయ పార్టీల ఒక్కరోజు ఖర్చుకు సరిపోదంటూ సూర్యాపేట జిల్లా ఎల్కారం ఎంపీటీసీ, బహుజన మేధావి,ఎంపీటీసీల సంఘం వ్యవస్థాపకులు బొళ్ళ కరుణాకర్ ముదిరాజ్ BKM 9848673447 హైదరాబాదులో తన నూతన ఇంటిలో గృహప్రవేశం సందర్భంగా కొంత మంది మిత్రులకు ఇచ్చిన విందులో జరిగిన ప్రైవేట్ సంభాషణలో బి.కె.ఎం.వ్యాఖ్యానించిన విషయాన్ని అభ్యుదయవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు.2014 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీలన్నీ కలిసి రూ.65 వేల కోట్లను వెచ్చిస్తే -2019లో అవి 128 వేల కోట్ల రూపాయల వరకు వ్యయీకరించినట్లు మద్యానికి డబ్బులకు ఆశపడి పవిత్రమైన ఓట్లను అమ్ముకోవద్దని ప్రచారం చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమ సంస్థలైన justice Association for India(JAI)మరియు Bharat organization for Revolutionari awakening (BORA)JAI,BORA లాంటి ప్రజా సంఘాలు సమగ్ర ఎన్నికల సంస్థల కోసం ఇటీవల దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో వెళ్ళడైన విషయాన్ని ప్రజాస్వామికవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 వెల్లడించారు.శాసనసభ ఎన్నికలూ నల్లధనం పరవళ్లతో పరువుతీ స్తున్నాయనీ ఇండియాలో ఉన్నది సార్వత్రిక వయోజన ఓటింగ్ పద్దతి అయినందువల్ల ఎన్నికయ్యే ప్రతినిధులదే కాదు,ఓటర్ల నిజాయతీనీ పదిలంగా కాపాడుకోవాలని ప్రజాస్వామిక వాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న హితవు పలికారు.
మరి ఇన్నేళ్లుగా పార్టీలేమి చేశాయి? డబ్బు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదుఅని ఓటర్లు బహిరంగంగానే భీష్మించేలా ప్రలోభాల మత్తులో వాళ్లను నిండా ముంచేశాయని,పోలింగ్ సమయంలో కోట్లకు కోట్లను ధారాళంగా వెచ్చించడం,అంతకంతా రాబట్టుకోవడానికి ఆపై విశృంఖల అవినీతికి లాకులెత్తడమనే అరాచక ఎన్నికల పద్మవ్యూహంలో అధికార, ప్రతిపక్షపార్టీలు ఇప్పుడు చిక్కుకుపోయాయని ప్రజాతంత్రవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 9701487102 ఆవేదన వ్యక్తం చేశారు.ధనవంతులు,నేరచరితులనే గెలుపు గుర్రాలుగా భావించి-తరతమ భేదాలతో రాజకీయ పక్షాలన్నీ ఏరికోరి వాళ్లకే వీరతాళ్లు వేస్తున్నాయనీ ప్రజాతంత్రవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు.
ఎన్నికల బరిలో కుల, మతాల విభజన రాజకీయాలు, తాయిలాల పంపకాలకు దోపిడి పార్టీలు తెగబడుతున్నాయనీ ప్రజాతంత్రవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.అంతులేని అధికార దుర్వినియోగాలకు పాల్పడుతూ-భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగాలైన స్వేచ్ఛాయుత సక్రమ ఎన్నికలను అవి తీవ్రంగా అపహాస్యం చేస్తున్నాయనీ ప్రజాస్వామికవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీల పెడధోరణులను నిరోధించాల్సిన తటస్థ సంస్థగా నిర్వాచన్ సదన్ ప్రతిష్ఠ నిలబడాలంటే,ప్రధానమంత్రి,లోక్ సభలో ప్రతిపక్ష నేత,భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులైన సంఘం ద్వారా ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని,ప్రజానేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ చేశారు.అధికారపక్షాల ప్రభావానికి ఏమాత్రం లోబడని,చట్టాలకు మాత్రమే జవాబుదారీ అయ్యే శక్తిమంతమైన ఎన్నికల నిర్వహణా వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలనీ ప్రజా ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టంకట్టేలా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు కృషి చేస్తున్న ప్రజాసంఘాలైనjustctic association for India(JAI) Bharat organization for revolutionari awakening (BORA)JAI BORA లాంటి ఎన్నో వివిధ సంఘాలు చేసిన మేలిమి సూచనలు చిరకాలంగా మోక్షంకోసం ఎదురుచూస్తున్నాయని ప్రజానేస్తం జైబోరన్ గారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.నూతన ఎన్నికల సంస్కరణలనూ పట్టాలకు ఎక్కించడంతో పాటు పోటీదారుల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా అతడే ప్రజాప్రతినిధి అయ్యే అసంబద్ధ విధానాన్నీ ప్రక్షాళించాలని ప్రజానేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న విజ్ఞప్తి చేశారు.
వచ్చిన ఓట్లశాతం ఆధారంగా పార్టీలకు సీట్లు కేటాయించే దామాషా ప్రాతినిధ్య వ్యవస్థను అందిపుచ్చుకోవాలనీ,పార్టీ విధేయతను తెగనమ్ముకునే అనైతిక నేతల చట్టసభల సభ్యత్వాలు తక్షణం రద్దు కావాలనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ చేశారు.ఆపై కనీసం అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి వాళ్లు అనర్హులయ్యేలా నిబంధనలను పదును తేస్తేనే-ప్రజాతీర్పులను పరిహసిస్తున్న రాజకీయ ఫిరాయింపుదారులను కట్టడి చేయడం సాధ్యపడుతుందనీ సామాజిక ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
స్వీయప్రయోజనాల కోసం దేశాన్ని పణంగా పెట్టని శీలసంపన్నులకే పార్టీలు టికెట్లు కేటాయించడమూ అత్యంత కీలకమనీ సామాజిక పరివర్తకుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.విశాల దేశహితాన్ని దృష్టిలో ఉంచుకుంటూ సమ్మిళిత సామాజికాభివృద్ధికి తాము అనుసరించబోయే విధానాలను రాజకీయపార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ప్రకటించాలనీ ప్రజాతంత్రవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.
ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు,ఎన్నికల్లో విజయం సాధించిన తరవాత ప్రజలకు ఇచ్చిన హామీలకు నీళ్లొదిలే పార్టీలు అధికారం కోల్పోవాలని వామపక్ష ప్రజా ఉద్యమకారుడు జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.ఆ మేరకు సమగ్ర ఎన్నికల సంస్కరణలు తేవాలని,నూతన ఎన్నికల సంస్కరణలు సాకారమైనప్పుడే- మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడంలో ఒక అర్థముంటుందనీ ప్రజాపరివర్తకుడు,వామపక్ష,ప్రజాతంత్ర, సామజిక ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 9848540078 పేర్కొన్నారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy