ఆ విమర్శే చిరంజీవి నేటి డ్యాన్సు లో స్టైల్ కి కారణం

తెలుగు సినిమా పరిశ్రమలోని సీనియర్ నటుల్లో ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారు? అంటే ఏమాత్రం ఆలోచించకుండా చిరంజీవి అని ఠక్కున చెప్తాం.వయసు మీద పడినా డ్యాన్స్ లోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నాడు మెగాస్టార్.

 How Chiranjeevi Builld His Style In Dance, Chiranjeevi, Chiranjeevi Dance Style-TeluguStop.com

అయితే చిరంజీవి ఈ రోజు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడంటే దానికి ఓ వ్యక్తి విమర్శే కారణం అని చెప్పుకోవచ్చు.తను అలా అనడం మూలంగానే ఆయన ఈ రోజు డ్యాన్సులో కొత్త ఒరవడి తీసుకొచ్చాడు.

డ్యాన్సులో తనకు తానే చాటి అనేలా చేస్తున్నాడు.అయితే చిరంజీవి డ్యాన్స్ గురించి కామెంట్ చేసిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

చిరంజీవి అప్పుడప్పుడే సినిమా రంగలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఐదో సినిమా షూటింగ్ జరుగుతోంది.ఓ పాటకి డ్యాన్స్ వేశాడు చిరంజీవి.

ఆయన స్టెప్పులకు సెట్స్ లోని వారంతా చప్పట్లు కొట్టారు.ఇంతలోనే ఈ సినిమాకు మేనేజర్ గా ప చేసిన వెంకన్న చిరంజీవి వైపు అలాగే చూశాడు.

నెమ్మదిగా చిరంజీవి ఆయన దగ్గరికి వెళ్లి ఎలా చేశాను డ్యాన్స్? అని అడిగాడు.ఆ నీ వెనుకున్న డ్యాన్సర్లు ఏం చేశారో.

నువ్వూ అదే చేశావు.నీవంటూ కొత్తగా చేసింది ఏముంది? అన్నాడు.అప్పుడే చిరంజీవికి ఏదో ఆలోచన మనసులో మెదిలింది.అవును డ్యాన్స్ మాస్టర్లు చెప్పినట్టు చేయడంలో ఏముంది.? దానికి అదనంగా మరేదైనా చేయాలి అనుకున్నాడు.

Telugu Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala Siva, Pooja Hegde, Ram Cha

అప్పుడే డ్యాన్సులోని కొత్త మెళకువలు తెలుసుకున్నాడు.పాటలో లీనమై డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు చిరంజీవి.తన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులను ఎంతగానో అలరించాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.రాంచరణ్, పూజా హెగ్డే కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే జనాల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా పాటలు కొన్ని విడుదల అయ్యాయి.జనాలను ఈ పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.

చిరంజీవి తన డ్యాన్సుతో మరోసారి అదరగొట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube