ఆ విమర్శే చిరంజీవి నేటి డ్యాన్సు లో స్టైల్ కి కారణం

తెలుగు సినిమా పరిశ్రమలోని సీనియర్ నటుల్లో ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారు? అంటే ఏమాత్రం ఆలోచించకుండా చిరంజీవి అని ఠక్కున చెప్తాం.

వయసు మీద పడినా డ్యాన్స్ లోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నాడు మెగాస్టార్.

అయితే చిరంజీవి ఈ రోజు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడంటే దానికి ఓ వ్యక్తి విమర్శే కారణం అని చెప్పుకోవచ్చు.

తను అలా అనడం మూలంగానే ఆయన ఈ రోజు డ్యాన్సులో కొత్త ఒరవడి తీసుకొచ్చాడు.

డ్యాన్సులో తనకు తానే చాటి అనేలా చేస్తున్నాడు.అయితే చిరంజీవి డ్యాన్స్ గురించి కామెంట్ చేసిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చిరంజీవి అప్పుడప్పుడే సినిమా రంగలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఐదో సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఓ పాటకి డ్యాన్స్ వేశాడు చిరంజీవి.ఆయన స్టెప్పులకు సెట్స్ లోని వారంతా చప్పట్లు కొట్టారు.

ఇంతలోనే ఈ సినిమాకు మేనేజర్ గా ప చేసిన వెంకన్న చిరంజీవి వైపు అలాగే చూశాడు.

నెమ్మదిగా చిరంజీవి ఆయన దగ్గరికి వెళ్లి ఎలా చేశాను డ్యాన్స్? అని అడిగాడు.

ఆ నీ వెనుకున్న డ్యాన్సర్లు ఏం చేశారో.నువ్వూ అదే చేశావు.

నీవంటూ కొత్తగా చేసింది ఏముంది? అన్నాడు.అప్పుడే చిరంజీవికి ఏదో ఆలోచన మనసులో మెదిలింది.

అవును డ్యాన్స్ మాస్టర్లు చెప్పినట్టు చేయడంలో ఏముంది.? దానికి అదనంగా మరేదైనా చేయాలి అనుకున్నాడు.

"""/"/ అప్పుడే డ్యాన్సులోని కొత్త మెళకువలు తెలుసుకున్నాడు.పాటలో లీనమై డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు చిరంజీవి.

తన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులను ఎంతగానో అలరించాడు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు.

ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.రాంచరణ్, పూజా హెగ్డే కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే జనాల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమా పాటలు కొన్ని విడుదల అయ్యాయి.

జనాలను ఈ పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి.చిరంజీవి తన డ్యాన్సుతో మరోసారి అదరగొట్టాడు.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?