బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో అసలు హీరోయిన్ శృతి హాసన్ కన్నా సెకండ్ హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది.సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనడమే కాకుండా ఈవెంట్స్ కి కూడా వచ్చింది.
మళయాళ హీరోయిన్ అయిన హనీ రోజ్ బాలయ్య సినిమాతోనే తెలుగు తెరంగేట్రం చేసిందని అంటున్నారు.కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే హనీ రోజ్ తెలుగులో చేసిన వీర సింహా రెడ్డి మాత్రమే కాదు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో నటించింది.

2008లో వచ్చిన ఆలయం సినిమాలో శివాజి సరసన హీరోయిన్ గా నటించింది హనీ రోజ్. ఆ సినిమాలో ఆమె అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.అయితే ఆ తర్వాత అమ్మడికి ఛాన్స్ లు రాలేదు.వీర సింహా రెడ్డి సినిమాలో హనీ రోజ్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది.ఆమెకు ఇక మీదట తెలుగులో తప్పకుండా వరుస అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.హనీ రోజ్ ని మన వాళ్లు ఎలా వాడుకుంటారన్నది చూడాలి.
బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాకు కూడా ఆమెను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
