తండ్రి మీద ప్రేమతో తల్లిని వదిలేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటించినప్పటికీ వాళ్ల వ్యక్తిగత జీవితాలు మాత్రం మనం స్క్రీన్ పైన సినిమా చూసినంత అందంగా మాత్రం ఉండవు ఎందుకంటే వాళ్ల జీవితాల్లో వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కానీ మనకు మాత్రం తెరపైన చాలా అందంగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు.వాళ్లు జనాలని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ల సాయ శక్తుల కృషి చేస్తారు అలా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగి పర్సనల్ గా చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్న నటి వైజయంతిమాల ఆవిడ స్వతహాగా క్లాసికల్ డాన్సర్.

 Heroine Vyjayanthimala Left Mother For Father,vyjayanthimala,vyjayanthimala Pers-TeluguStop.com

ఆవిడ 1950లో తెలుగు సినిమా జీవితంలో అలాగే తమిళ్ సినిమా వాచ్ కాయ్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది అదే విధంగా బాలీవుడ్ లో కూడా టాప్ స్టార్ గా ఎదుగుతూ క్లాసికల్ డాన్సర్ గా కూడా మంచి గుర్తింపును సాధించింది అలాగే క్లాసికల్ డాన్సర్ గా ట్రింకిల్ ట్రోఫీ కూడా అందుకుంది జీవితం ఇంత చక్కగా సాగుతున్నప్పటికీ తను చినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.వైజయంతి వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది ఆవిడ పేరు వసుంధరాదేవి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకొని అప్పుడున్న హీరోలందరిలో బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్నారు.
అయితే వసుంధరాదేవి రామన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరికీ వైజయంతిమాల జన్మించింది.వసుంధరాదేవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటంవల్ల తనకు ఇండస్ట్రీలో పరిచయమైన ఒక వ్యక్తి నువ్వు టాప్ హీరోయిన్ వి ఇక్కడ వీళ్ళతో ఇలా ఉండకూడదు నీకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి నువ్వు పర్సనల్ గా ఒక్కదానివే ఉంటే హీరోయిన్ గా ఇంకా మంచి పేరు వస్తుంది అని చెప్పడంతో రామన్ వసుంధర దేవి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి దీంతో ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు వైజయంతిమాల వాళ్ళ అమ్మ చేసే పనులన్నింటినీ చూస్తుంది కానీ ఆవిడకి ఏం చేయాలో తెలియట్లేదు దాంతో కోర్టు లో ఇద్దరు డైవర్స్ తీసుకున్న తర్వాత నువ్వు ఎవరితో ఉంటావు అని అడిగితే మా డాడీ తో ఉంటాను మా అమ్మ నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ల అమ్మని తిట్టింది అయిన కూడా వసుంధరాదేవి ఆ మాటలను లెక్కచేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత వైజయంతిమాల వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది.

ఇంత విషాద బాధను భరిస్తూ కూడా వైజయంతి మాల సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది.

Telugu Vyjayanthi Mala, Vyjayanthimala-Telugu Stop Exclusive Top Stories

వైజయంతిమాల ఆర్టిస్ట్ గానే కాకుండా ఆవిడ గోల్ఫ్ ప్లేయర్ గా, రాజకీయ నాయకురాలిగా, క్లాసికల్ డాన్సర్ గా కూడా మంచి గుర్తింపు సాధించింది.కొన్ని సినిమాలు చేసిన తర్వాత తను సినిమాలు చేయకూడదు ఇకపై నుంచి మన ఫ్యామిలీ తో మన జీవితాన్ని గడపాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకొని 1965 తర్వాత సినిమాలు చేయడం మానేసింది.పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు ఎంత మంది తన దగ్గరకు వచ్చి అడిగిన కూడా తను సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు సినిమాలు చేసి బిజీగా ఉండడం తనకి నచ్చలేదు చేసిన సినిమాలు చాలు ఇక తన లైఫ్ మొత్తం ఫ్యామిలీతో గడపాలి అని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించారు.

Telugu Vyjayanthi Mala, Vyjayanthimala-Telugu Stop Exclusive Top Stories

ఆవిడ సినిమాని వదిలేసింది కానీ ఎప్పుడూ కూడా భరతనాట్యంని వదిలేయలేదు దానికి సంబంధించిన పనులు ఎప్పుడు చూసుకుంటూ వుండేది.ఆవిడ 1989లో తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ లో పాల్గొని రాజ్యసభకు ఎన్నికయ్యారు అలాగే 1999లో బిజెపి పార్టీలో చేరి అక్కడ కూడా తమ నాయకత్వ ప్రతిభ ను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు ఈమధ్య సౌత్ లో నెంబర్1 డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 లో ఒక క్యారెక్టర్ చేయమని కమల్ హాసన్ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగినప్పటికీ తను సినిమాలు చేయడం లేదని ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చేయడం కుదరదని చెప్పి కమల్ హాసన్ ని పంపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube