లిక్కర్ స్కాం కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియా బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

 Hearing On Sisodia's Bail Petition In Liquor Scam Case Adjourned-TeluguStop.com

మనీశ్ సిసోడియాను మరో రోజులపాటు సీబీఐ కస్టడీకి కోరింది.మద్యం కుంభకోణం కేసులో సిసోడియా విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ.

ఐదు రోజుల కస్టడీలో భాగంగా ప్రతి రోజు రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించామని దర్యాప్తు బృందం న్యాయస్థానానికి వివరించింది.అయితే ఇంకా కనపడని ఫైల్స్ ఆధారాల కోసం సిసోడియాను ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.

మరోవైపు కస్టడీ పొడిగింపును సిసోడియా తరపు న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ వ్యతిరేకించారు.సిసోడియాతో బలవంతంగా ఒప్పించేలా సీబీఐ ప్రవర్తిస్తోందని వాదనలు వినిపించారు.

సిసోడియా కస్టడీలో ఉంటే కనపడకుండా పోయిన ఫైల్స్ ఆధారాలు వస్తాయా అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే కస్టడీ పొడిగింపుపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

అదేవిధంగా బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని సీబీఐకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube