లిక్కర్ స్కాం కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియా బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

మనీశ్ సిసోడియాను మరో రోజులపాటు సీబీఐ కస్టడీకి కోరింది.మద్యం కుంభకోణం కేసులో సిసోడియా విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ.

ఐదు రోజుల కస్టడీలో భాగంగా ప్రతి రోజు రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించామని దర్యాప్తు బృందం న్యాయస్థానానికి వివరించింది.

అయితే ఇంకా కనపడని ఫైల్స్ ఆధారాల కోసం సిసోడియాను ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.

మరోవైపు కస్టడీ పొడిగింపును సిసోడియా తరపు న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ వ్యతిరేకించారు.సిసోడియాతో బలవంతంగా ఒప్పించేలా సీబీఐ ప్రవర్తిస్తోందని వాదనలు వినిపించారు.

సిసోడియా కస్టడీలో ఉంటే కనపడకుండా పోయిన ఫైల్స్ ఆధారాలు వస్తాయా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే కస్టడీ పొడిగింపుపై సమగ్ర విచారణ జరపాలన్నారు.అదేవిధంగా బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని సీబీఐకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్… రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?