అమ్మాయిలకు హీరోలా సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.. కట్ చేస్తే పరువు పోయింది...

రోడ్డుపై ప్రమాదానికి గురైన ఇద్దరు యువతులకు ఓ వ్యక్తి సాయం చేసేందుకు హీరోలా పరిగెత్తుకొచ్చాడు.ఆ తర్వాత వారిని కాపాడటం అటు ఉంచితే అతడే చిక్కుల్లో పడ్డాడు.

 He Came Forward To Help The Girls Like A Hero, Viral News, Latest News, Trending-TeluguStop.com

అంతేకాదు ఆ యువతుల స్కూటర్ ను పొరపాటున సరస్సులో పడేసాడు.అతను కూడా సరస్సులో పడ్డాడు.

ఈ తమాషా సంఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియ రాలేదు కానీ దీనిని “గాడ్ మాన్ చిక్నా”( God Man Chicna ) ట్విట్టర్ పేజీ పోస్ట్ చేసింది.

వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఓ వీధిలో స్కూటర్‌పై వెళుతున్నట్లు కనిపించింది.

బ్యాలెన్స్‌ తప్పి స్కూటర్‌పై నుంచి వారు కింద పడ్డారు.వారు రోడ్డు పక్కన, సరస్సు దగ్గర కింద పడ్డారు.

వారికి సహాయం చేయడానికి ఒక వ్యక్తి వచ్చి వారి స్కూటర్‌ను( scooter ) తీసుకుంటాడు.కానీ అనుకోకుండా యాక్సిలరేటర్ నొక్కడంతో స్కూటర్ వేగం పెరిగింది.

దాంతో స్కూటర్ ఆ మనిషిని ఒక్కసారిగా సరస్సులోకి తీసుకెళ్తుంది.ఫలితంగా ఆ వ్యక్తితో పాటు స్కూటర్ సరస్సులో పడిపోయారు.

ఇది చూసిన అమ్మాయిలు షాక్ అవుతున్నారు.వీడియో క్యాప్షన్ ప్రకారం ఒకరికి సహాయం చేయాలంటే మనం ప్రాబ్లం లో పడతాం అని ఫన్నీగా పెట్టారు.

చాలా మంది ఈ వీడియోను చూసి కామెంట్స్ చేశారు.వారిలో కొందరు నవ్వారు, మరికొందరు ఇలాంటి ప్రమాదాల గురించి సొంత కథలను పంచుకున్నారు.ఒక యూజర్ రిప్లై ఇస్తూ “నేను కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేశాను.యాక్టివా పైనుంచి పడిపోయిన ఒక వృద్ధుడిని సహాయం చేయడానికి ప్రయత్నించా.కానీ యాక్సిలరేటర్ ఇరుక్కుపోయింది, స్కూటర్ లేపగానే అదొచ్చి నా కారు డోర్‌ను తాకింది.నేను ఇబ్బందుల్లో పడ్డాను.” అని అన్నాడు.

ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కనే పార్క్ చేసిన తెల్లటి కారు కూడా కనిపిస్తోంది.అమ్మాయిలు పడిపోయినప్పుడు దాదాపు కారును ఢీకొట్టారు.ఆ వ్యక్తి స్కూటర్‌ని ఎత్తగానే దాదాపు కారును ఢీకొట్టాడు.

ఒక వ్యక్తి దీనిని గమనించిన నెటిజన్లు “కారు యజమాని చాలా అదృష్టవంతుడు.అతని లేదా ఆమె కారు రెండు ప్రమాదాల నుండి తప్పించుకుంది.” అని ఫన్నీగా కామెంట్ చేశారు.ఈ వీడియోకు 85 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube