కొవ్వొత్తిని ఆర్పేసే ఆటోమేటిక్ డివైజ్‌ ఎప్పుడైనా చూశారా..

సాధారణంగా వెలిగించిన కొవ్వొత్తిని( Candle ) ఎవరూ చూడకుండా వదిలేస్తే అది అగ్ని ప్రమాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది.ఈ ప్రమాదాలను నివారించేందుకు వందేళ్ల కంటే ఎక్కువ కాలం క్రితమే ఒక పరిష్కారం కనుగొన్నారు.

 Have You Ever Seen An Automatic Candle Extinguishing Device , Viral News,   Vira-TeluguStop.com

దానిని ఆటోమేటిక్ క్యాండిల్ ఎక్స్‌టింగ్విషర్‌ అంటారు.ఈ డివైజ్ కొవ్వొత్తి మంటను దానికదే ఆర్పేయగలదు.

వెలిగించిన కొవ్వెత్తికి దీనిని అటాచ్ చేస్తే సరిపోతుంది.కొంచెం కాలినాక, సగం కాలిన తర్వాత లేదా దాదాపు పూర్తిగా కాలిన తర్వాత కొవ్వొత్తి ఆరిపోయేలా దీనిని సెట్ చేసుకోవచ్చు.

ఇది ఎలా పని చేస్తుందో చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.దీనిని @ScienceGuys_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

షేర్ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి 28 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ పరికరం భద్రత కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.వైరల్‌ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు వెలిగించిన ఒక కొవ్వొత్తి, దానికి అటాచ్ చేసిన ఒక ఆటోమేటిక్ క్యాండిల్ ఎక్స్‌టింగ్విషర్‌ కనిపిస్తుంది.కొవ్వొత్తి కొంత కాలిన తర్వాత ఆ పరికరం పైభాగం వేగంగా మూసుకుపోతుంది.

అలాగే మంటను ఆర్పేస్తుంది.ఇది ఒక స్ప్రింగ్ లాగా పని చేస్తుంది.

ఆ స్ప్రింగ్ అనేది కొవ్వొత్తి ఒక ప్లేస్ దాక కరిగిపోయాక పనిచేయడం వల్ల ఈ డివైజ్‌ పైభాగం క్లోజ్ అవుతుంది.ఆ విధంగా ఫైర్ ఆర్పేయడం జరుగుతుంది.

మంటను ఎప్పుడు ఆపాలో దీనిని అమర్చే హైట్ పై ఆధారపడి ఉంటుంది.కొవ్వొత్తులను ఇష్టపడే వ్యక్తులు అగ్ని గురించి చింతించకుండా వాటిని ఆస్వాదించడానికి ఆటోమేటిక్ క్యాండిల్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఉపయోగించవచ్చు.కొవ్వొత్తులు ఒక స్థలాన్ని చక్కగా, మంచి వాసన కలిగిస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే ప్రమాదకరమైనవి కూడా కావచ్చు.ప్రజలు కొవ్వొత్తులను ఉపయోగించినప్పుడు మరింత రిలాక్స్‌గా, సురక్షితంగా అనుభూతి చెందడానికి ఆటోమేటిక్ క్యాండిల్( Automatic candle ) ఎక్స్‌టింగ్విషర్‌ టూల్ సహాయపడుతుందిమతపరమైన లేదా సాంస్కృతిక కారణాల కోసం లేదా ప్రత్యేక కార్యక్రమాల కోసం కొవ్వొత్తులను ఉపయోగించే ప్రదేశాలలో కూడా ఇది సహాయకరంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube