ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేన మధ్య సీట్ల కేటాయింపు వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు( Pawan Kalyan ) లేఖాస్త్రాలు సంధించిన కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగోండి హరిరామ జోగయ్య( Chegondi Harirama Jogaiah ) ఓ లేఖను విడుదల చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో( West Godavari District ) టీడీపీ – జనసేన పార్టీల మధ్య అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఎలా జరగబోతుందనే ఆసక్తి ఇరు పార్టీలకు చెందిన నేతలతో పాటు ఏపీ ప్రజల్లో కూడా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి( Janasena ) 11 అసెంబ్లీ సీట్లు మరియు ఒక పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలని హరిరామ జోగయ్య తన లేఖలో వెల్లడించారు.
ఈ సీట్లను జనసేన సాధించలేకపోతే జరిగే నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.
టీడీపీ – జనసేన పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లనే చర్చ సర్వత్రా ఉత్కంఠగా మారింది.తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ప్రజాభీష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయానికి వచ్చాయని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని పవన్ సామాజిక వర్గం మెండుగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దాదాపు 90 శాతం మంది ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు జనసేనకు మద్ధతుగా నిలుస్తున్నారు.ఒకవేళ ఇక్కడ టీడీపీకి( TDP ) చెందిన అభ్యర్థులు విజయం సాధించాలన్న తప్పనిసరిగా జనసేన ఓటర్లు సపోర్టు చేయాల్సిందే.లేని పక్షంలో వారు విజయం సాధించడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని హరిరామ జోగయ్య లేఖలో తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీని( YCP ) ఓడించి ఉమ్మడి జిల్లాలోని సీట్లన్నింటినీ సాధించాలంటే.జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లోని సీట్లన్నీ తప్పనిసరిగా వారికే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.జన సైనికుల బలం లేకుండా టీడీపీ గెలిచే అవకాశం కూడా లేని నేపథ్యంలో.నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, ఉండి, పోలవరం మరియూ కొవ్వూరు అసెంబ్లీ స్థానాలు మరియు నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని జనసేనకు కేటాయించాల్సిందేనని లేఖలో డిమాండ్ చేశారు.
అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన డిమాండ్ చేసే ఈ స్థానాలను టీడీపీ ఇచ్చేందుకు అంగీకరిస్తుందా.? ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఎంతవరకు విజయాన్ని సాధిస్తాయనేది తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.