గులాబీ పార్టీపై గుత్తా సంచలన వ్యాఖ్యలు

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌( BRS )కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసిఆర్ కోటీశ్వరులు అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని,అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారని అన్నారు.కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్‌కు ఈ పరిస్థితి వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే నాయకులు పార్టీని వీడుతున్నారని, ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాలామంది కోటీశ్వరులు అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్‌లో అంతర్గత సమస్యలు,నేతల సహాయనిరాకరణతో అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కీలక నేతలుగా భావించే వారు అహంకారంగా వ్యవహరించడంతో పార్టీ పూర్తిగా ప్రజలకు దూరమైందని చెప్పారు.ఎమ్మెల్సీల అనర్హత అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

న్యాయపరమైన చిక్కులు లేకుండా సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.అయితే, తాజాగా గుత్తా( Gutha Sukender Reddy ) కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది.ఇదే నిజమైతే నల్లగొండలో బీఆర్ఎస్‌కు భారీ దెబ్బపడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Latest Nalgonda News