గురుకుల ప్రిన్సిపాల్ సస్పెండ్

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో మరో 8 మంది విద్యార్థులకు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు.

గత నాలుగు రోజుల నుండి ముందుగా ఫుడ్ పాయిజన్ తో 25 మంది బాలికలు అస్వస్థతకు గురికాగా,తెల్లారే 5 గురిని ఎలుకలు కరవడంతో గురుకులంలో పరిస్థితి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది.

ఆ ఘటనలపై విచారణ జరుగుతుండగానే మరో 8 మంది విద్యార్థునిలు అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు.

Gurukul Principal Suspended-గురుకుల ప్రిన్సిపా

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇదిలా ఉంటే దామరచర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ పుష్పలతను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ రోనాల్డ్ రోజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

రుణ బాధలు తొలగిపోవాలంటే.. ప్రతిరోజు క్రమం తప్పకుండా వంట గదిలో ఇలా చేయండి..!
Advertisement

Latest Nalgonda News