హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.హనుమాన్ ర్యాలీ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తు అరెస్ట్ నేపథ్యంలో పోలీసుల తీరుపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో నిజాం పాలన నడుస్తోందని ఆరోపించారు.
అవినీతిని ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ఇందులో భాగంగానే బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని మండిపడ్డారు.
తనను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.