Driving license rc : వాహనదారులకు గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ మీతో తీసుకెళ్లకపోయినా నో టెన్షన్

ఒక్కోసారి హడావుడిగా బయటికి వెళ్తుంటాం.ఆ సమయంలో మన వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి వెంట తీసుకెళ్లడం మర్చిపోతుంటారు.

 Good News For Motorists No Tension Even If You Don't Carry Driving License, Rc W-TeluguStop.com

ఎక్కడైనా పోలీసులు మన వాహనాలను నిలిపితే వాహన పత్రాలు లేవని మనకు ఫైన్లు వేసే అవకాశం ఉంటుంది.అయితే ఈ సమస్యకు అద్భుత పరిష్కారం ఉంది.

కేవలం మన ఫోన్ మన వెంట ఉంటే చాలు.ఏ ట్రాఫిక్ పోలీస్ మనకు ఫైన్లు వేసే అవకాశం ఉండదు.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటివి మన ఫోన్లలోని రెండు యాప్‌లలో నిక్షిప్తం చేసుకుంటే సరిపోతుంది.ట్రాఫిక్ పోలీసులకు అవి చూపించగానే మన జోలికి రారు.

దీని గురించి తెలుసుకుందాం.

ప్రతి సారీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటివి పట్టుకెళ్లడం వీలు పడదు.

అలాంటి సమయంలో మనకు డిజిలాకర్, ఎమ్‌పరివాహన్ వంటి యాప్‌లు ఉపయోగపడతాయి.వాటిలో మన వాహన పత్రాలు సేవ్ చేస్తే చాలు.

అవి ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో సమానంగా పరిగణించబడతాయి.ఈ విషయాన్ని ఇటీవలే కేంద రోడ్డు రవాణా శాఖ స్పష్టం చేసింది.“mParivahan లేదా DigiLockerలో డాక్యుమెంట్లు ఉంచుకుంటే వాహనదారులకు చాలా ఉపయోగం ఉంటుంది.

Telugu Licence, Insurance, Mparivahan App, Vehicle Number, Vehicles, Latest-Late

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ మరియు పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ (DL), పొల్యూషన్-అండర్-కంట్రోల్ సర్టిఫికేట్ (PUC) మరియు ఏదైనా ఇతర సంబంధిత వాహన పత్రాలను మనం ఆ యాప్‌లలో సేవ్ చేసుకోవచ్చు.దీనికి సంబంధించి నవంబర్ 2018లో కేంద్ర మోటారు వాహనాల నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది.mParivahan మొబైల్ యాప్‌ను NIC ద్వారా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అందిస్తోంది.

వాహనాలకు సంబంధించిన డిఎల్ లేదా వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఆర్‌సి, డిఎల్, ఫిట్‌నెస్ చెల్లుబాటు, బీమా చెల్లుబాటు మరియు పర్మిట్ చెల్లుబాటు వివరాలు ఈ మొబైల్ యాప్‌లో రియల్ టైమ్ ప్రాతిపదికన లభిస్తాయని పేర్కొంది.అయితే వాటిని ఫొటోలు తీసి చూపిస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులు అంగీకరించరు.

కేవలం ఈ రెండు యాప్‌లలో మాత్రమే సేవ్ చేసుకుంటే చెల్లుబాటు అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube