మనందరికీ గూగుల్ మ్యాప్స్( Google Maps ) గురించి తెలిసే ఉంటుంది.ప్రతిఒక్కరూ ఒక్కసారైనా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే ఉంటారు.
మనకి తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు లొకేషన్ తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళుతుంటారు.అలాగే ఏదైనా కొత్త ప్రాంతం గురించి తెలుసుకునేందుకు చాలామంది గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు.
దీంతో కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్స్ చాలా ఉపయోగపడతాయి.ప్రతిఒక్కరి మొబైల్స్‌లో డీఫాల్ట్‌గా గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటుంది.
తాజాగా గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్ ను తీసకొచ్చింది.అదేంటంటే.గ్లాన్సబుల్ డైరెక్షన్స్ ఫీచర్( Glanceable Directions feature ).దీని ద్వారా లాక్ స్క్రీన్స్‌పై, రూట్ ఓవర్ వ్యూపూై కూడా ట్రావెల్ ప్రోగ్రెస్‌ను తెలుసుకోవచ్చని గూగుల్ సంస్థ చెబుతోంది.ఈ ఫీచర్ ను మీ మొబైల్ లో ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందట.గమ్యస్థానానికి చేరే రూట్లను, రూట్ ప్రోగ్రెస్, రూట్ లో వచ్చే టర్నింగ్స్ గురించి ముందుగా ఇందులో చూపిస్తుంది.
అయితే గతంలోనే ఇలాంటి ఫీచర్ ఉన్నప్పటికీ అది ఫుల్ నేవిగేషన్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే చూపించేది.కానీ ఇప్పుడు లాక్ చేసిన స్క్రీన్‌పైకి కూడా చూపించేలా ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చారు.
అలాగే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఏఐ ద్వారా పర్యాటక ప్రదేశాల్లోని ఫొటోలను త్రీడీలో చూసే అవకాశం లభించనుంది.అలాగే గూగుల్ మ్యాప్స్ విండో క్లోజ్ చేసినప్పటికీ ప్రయాణికుల జర్నీ వివరాలను భద్రపరుస్తుంది.యూజర్ వెళ్లిన మార్గాలను సేవ్ చేసుకుని భద్రపరుస్తుంది.ఈ కొత్త ఫీచర్లు యూజర్లకు ఎంతో ఉపయోగపడతాయని, మరింత సులువుగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు.త్వరలోనే ఈ ఫీచర్లను మరింతగా అప్డేట్ చేయనున్నారని తెలుస్తోంది.