ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో సీజ్ చేసిన గంజాయి దగ్ధం

నల్లగొండ జిల్లా:ఇటీవల జిల్లా వ్యాప్తంగా 43 కేసులలో పట్టుబడ్డ 565 కిలోల గంజాయిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్ పల్లి మండలం గుమ్మలబావి వద్ద గల పోలీస్ ఫైరింగ్ ప్లేస్ వద్ద జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధ్వర్యంలో మంగళవారం దగ్ధం చేశారు.

ఈ గంజాయి విలువ 1 కోటి 41 లక్షల 25 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా డ్రగ్స్ రవాణాపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరోసారి స్పష్టం చేశారు.

How Modern Technology Shapes The IGaming Experience

Latest Nalgonda News