బాసర విద్యార్థులకు సంపూర్ణ మద్దతు

నల్లగొండ జిల్లా:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం యూత్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గురువారం అసోసియేషన్ సెక్రటరీ గడ్డం ధర్మేంధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వైస్ ఛాన్సలర్ (విసి)ని నియమించాలని,ల్యాప్ ట్యాప్స్, స్టడీ మెటీరియల్స్,డ్రెస్సులు సకాలంలో అందించాలని ఐసిటి తరహాలో బోధన చేయాలని,మెనూ ప్రకారం భోజనం వసతులు అందించాలని,తరగతి గదులలోని ఫ్యాన్లు,ఫర్నిచర్ తదితర వసతులను కల్పించాలని, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

క్యాంపస్ కు చెందిన ముగ్గురు విద్యార్థులను నిర్బంధించినట్లు తెలుస్తుందని,వెంటనే వారిని విడుదల చేయాలని,లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Full Support To Basra Students-బాసర విద్యార్థులక

Latest Nalgonda News