ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంప్

జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంప్( Free Summer Coaching Hockey Camp ) ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయకుమార్ తెలిపారు.

సోమవారం ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన హాజరై క్రీడాకారులకు హాకీ స్టిక్స్,బాల్స్ మరియు క్రీడ సామాగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ హాకీ అసోసియేషన్( Nalgonda Hocky Association ) అద్భుతంగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారు.నల్లగొండ తరపున గత క్రీడా సంవత్సరంలో 18 మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో పాల్గొన్నారని చెప్పారు.

Free Summer Coaching Hockey Camp,Nalgonda Hockey Association,Nalgonda,Summer Coa

అనంతరం నల్లగొండ హకీ అసోసియేషన్ అధ్యక్షుడు కూతురు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు.నల్లగొండ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం మాట్లాడుతూ జిల్లాకు రెండు కిలో ఇండియా సెంటర్లు రావడం జిల్లా అదృష్టమన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ హాకీ అసోసియేషన్ చైర్మన్ కూతురు లక్ష్మారెడ్డి,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసచారి,ఫరూక్,యావర్, అజిత్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
భార్యల అక్రమ సంబంధాలకు.. భర్తలు బలి.. కొద్దిరోజుల్లోనే 12 మంది కాటికి.. అసలేం జరుగుతోంది?

Latest Nalgonda News