*డెబ్బై ఏండ్ల మూసీ చరిత్రలో మొదటి సారి...!

నల్గొండ జిల్లా

:జిల్లాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు( Nagarjunasagar project ) తర్వాత రెండో పెద్ద జలాశయంగా పేరొందిన కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు( Musi project ) 70 ఏండ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నిండు వేసవిలో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 6.45 టిఎంసిలకు చేరుకొనిజలకళను సంతరించుకుంది.

దీనితోసోమవారం తెల్లవారు జామున నీటి పారుదల శాఖ అధికారులు 3 క్రస్ట్ గేట్లను 6 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంతో పాటు మేడ్చల్, మల్కాజిగిరి,రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ,జిల్లాల నుండి వాగులు వంకల ద్వారా ఇటివలే అకాల వర్షాలకు వరదనీరు వచ్చి చేరింది.దీంతో నిండు వేసవిలో మూసి ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతూ నిండుకుండలా మారింది.

For The First Time In The History Of Seventy Years Of Musi Project Details, Dist

నీటిని దిగువకు విడుదల చెయ్యొద్దు చెరువులు కుంటలు నింపండి.! వర్షాకాలం సీజన్ మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.

రోహిణి కార్తె జూన్ 7 కి వెళ్ళిపోయి,8కి మృగశిర కార్తె ప్రారంభం కానుంది.మృగశిర కార్తె మొదలు కావడంతో వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది.

Advertisement

అయితే దిగువకు నీటిని విడుదల చెయ్యడంతో నీరు వృథా అయిపోతుండంతో మూసీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.మూ‌సీ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం నీటిని దిగువకు విడుదల చెయ్యకుండా మూసీ ఆయకట్టు రైతులకు ఉపయోగపడేలా చెరువులు,కుంటలు నింపాలని కోరుతున్నారు.

దానితో గ్రౌండ్ వాటర్ పెరిగి పశువులకు నీటి వసతి కల్పించినట్లవుతుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.రెండు రోజుల్లో వర్షాకాలం సీజన్ ప్రారంభం కానుండడంతో రైతులు ముందస్తుగా నార్లు పోసుకోవడంతో సరైన సమయంలో వ్యవసాయం చెయ్యడంతో రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు.

Advertisement

Latest Nalgonda News