డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టార్గెట్ చేస్తున్నారంటూ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాజీ భర్త బిల్ స్టీవెన్సెన్( Bill Stevenson ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బిల్-జిల్లు 1970 నుంచి 1975 వరకు వైవాహిక జీవితాన్ని గడిపారు.
ఆ తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు.తాజాగా న్యూస్ మాక్స్‌లో గ్రెగ్ కెల్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవెన్సెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ పై జరుగుతున్న పరిశోధనల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .తాను ఇష్టపడే, గౌరవించే వ్యక్తిని ఇలా చేయనివ్వనని స్టీవెన్సన్ తెలిపారు.
1970లలో బైడెన్ న్యాయసంస్థ తనను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ముందు ఇబ్బంది పెట్టిందని ఆయన ఆరోపించారు.బైడెన్ సోదరుడు ఫ్రాంక్ బైడెన్.
( Frank Biden ) నా విడాకుల చర్చలలో జోక్యం చేసుకోవడానికి భయపెట్టేలా ప్రకటనలు చేశాడని స్టీవెన్సన్ వ్యాఖ్యానించారు.ఆమెకు (జిల్ బైడెన్) ఇల్లు ఇవ్వాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఫ్రాంక్ తనను బెదిరించాడని చెప్పారు.
జో బైడెన్,( President Joe Biden ) అమెరికా న్యాయశాఖ శక్తిని తను నమ్మలేకపోయానని స్టీవెన్సన్ తెలిపారు.
జో, జిల్ బైడెన్ల ప్రారంభ జీవితంపై తాను రాసిన పుస్తకం త్వరలోనే రిలీజ్ చేస్తానని స్టీవెన్సన్ ప్రకటించారు.జో బైడెన్ అతని కుటుంబం ఆరోపణలు వున్నప్పటికీ.ఇప్పటికీ తన మాజీ భార్య( Jill Biden ) గురించి శ్రద్ధ తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
తన చుట్టూ వున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసునని.తన సమస్య మాత్రం జో బైడెన్‌తోనే అని స్టీవెన్సన్ అన్నారు.
అయితే బైడెన్ దంపతులపై స్టీవెన్సన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ డెమొక్రాటిక్ ప్రైమరీని గెలిచినప్పుడు.డైలీ మెయిల్ వార్తాసంస్థతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తన భార్యతో బైడెన్ సంబంధం పెట్టుకున్నారన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు.కానీ వీటికి బైడెన్ దంపతులు అదే రేంజ్లో కౌంటరిచ్చారు.స్టీవెన్సన్ నుంచి విడిపోయిన తర్వాత బైడెన్ తొలి భార్య కారు ప్రమాదంలో మరణించిన సమయంలో తమ మధ్య బంధం ఏర్పడిందన్నారు.