కొంతమంది నటీమణులు తక్కువ సినిమాలలో నటించినా తమ నటనతో సత్తా చాటుతూ ఉంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని అలాంటి నటీమణులలో బెంగళూరు పద్మ ( Bangalore padma )ఒకరు కాగా ఈ నటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన దృష్టిలో మాటకు శక్తి ఉందని ఆ మాటే మంత్రమైందని ఆమె చెప్పుకొచ్చారు.
మన పూర్వీకులకు అద్భుతమైన తెలివి ఉందని మనకు అంత తెలివి లేదని ఆమె కామెంట్లు చేశారు.
అత్తామామల కోసం కెరీర్ ను వద్దని అనుకున్నానని బెంగళూరు పద్మ పేర్కొన్నారు.నాకు తోచదు అనే మాట ఉండదని ఆమె పేర్కొన్నారు.నా ఇంట్లో నేనే పని చేసుకుంటానని బెంగళూరు పద్మ అన్నారు.
భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదని బెంగళూరు పద్మ తెలిపారు. రామానాయుడు( D.Ramanaidu ) గారిపై ఉన్న అభిమానం వల్ల సురేష్ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేశానని ఆమె కామెంట్లు చేశారు.
రామానాయుడు గారు అవసరమైతే ట్రాలీ కూడా తోసేవారని బెంగళూరు పద్మ పేర్కొన్నారు.సినిమా అంటే రామానాయుడు గారికి ఫ్యాషన్ అని ఆయన పేర్కొన్నారు.చిన్నవాళ్లను సైతం పేరు పెట్టి పిలిచి గౌరవించేవారని బెంగళూరు పద్మ అన్నారు. ప్రేమించుకుందాం రా సినిమా(Preminchukundam Raa ) ఒక్కరోజు షూటింగ్ కోసం వెళ్లానని ఆమె తెలిపారు.
ఒక సినిమా షూటింగ్ సమయంలో కోట గారు నన్ను చూసిన వెంటనే వచ్చావా రావే అని అన్నారని ఆమె పేర్కొన్నారు.హా అంకుల్ వచ్చానని నేను సమాధానం ఇచ్చానని బెంగళూరు పద్మ అన్నారు.
కారంచేడులో ప్రేమించుకుందాంరా షూట్ జరిగిందని ఆమె పేర్కొన్నారు.బెంగళూరు పద్మ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరు పద్మ కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ జనరేషన్ లో కూడా బెంగళూరు పద్మకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.