భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న నూనె గింజల పంటలలో ఆవాల పంట( Mustard Crop ) కూడా ఒకటి.నీటి వనరులు తక్కువగా ఉన్న, సులభ పద్ధతిలో సాగు చేసి మంచి ఆదాయం పొందే పంటలలో ఆవాల పంట కూడా ఒకటి.
ఆవాల పంట సాగుకు కాస్త బరువుగా ఉండే నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి.తేలికపాటి నల్లరేగడి నేలలు ఒండ్రు నేలల్లో కూడా ఆవాల పంట సాగు చేయవచ్చు.
అక్టోబర్ మొదటివారం నుంచి నవంబర్ మొదటివారం వరకు ఈ పంటను విత్తుకోవడానికి అనువైన సమయం.వేసవికాలంలో( Summer ) పొలాన్ని లోతు దుక్కులు దున్నుకొని ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పూర్తిగా పొలం నుంచి తొలగించాలి.
ఒక ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువు,( Cattle Manure ) 15 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.
ఇక పంట 55 రోజుల దశలో ఉన్నప్పుడు పై పాటుగా నత్రజని ఎరువు( Nitrogen ) అందించాలి.ఒక ఎకరాకు 2.5 కిలోల విత్తనాలు అవసరం.విద్య ముందు విత్తన శుద్ధి చేసుకుంటే పంటకు నేల నుంచి వివిధ రకాల తెగుళ్లు ( Pests ) ఆశించే అవకాశం ఉండదు.ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల కాప్టాన్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
ఆవాల పంట మొలకెత్తిన మూడు వారాల లోపు కలుపు మొక్కలను( Weed Plants ) పొలంలో తొలగించాలి.పైరు 30 రోజుల దశలో ఉన్నప్పుడు అంతర సేద్యం చేయాలి.నీటి విషయానికి వస్తే.
మొత్తంగా ఆవాల పంటకు మూడు లేదా నాలుగు నీటి తడులు అవసరం.కోమ్మలు ఏర్పడే దశలో, పూత ఏర్పడే దశలో కచ్చితంగా నీటి తడులు అందించాలి.
ఆవాల పంటను పత్తి లేదా మొక్కజొన్న లాంటి పంటలలో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.