అవినాష్ తండ్రి కాబోతున్నాడంటూ జోరుగా ప్రచారం.. ఆయన ఏమన్నారంటే?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో అవినాష్ ఒకరు.అయితే బిగ్ బాస్ షోలో ఆఫర్ రావడం వల్ల ఆ షోకు దూరమైన అవినాష్ ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే పలు ప్రోగ్రామ్స్ లో కనిపించడంతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

 Fake News Viral About Jabardasth Avinash Details Here Goes Viral  Jabardasth, Av-TeluguStop.com

అయితే అవినాష్ తండ్రి కాబోతున్నాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వార్త తన దృష్టికి కూడా రావడంతో అవినాష్ ఈ వార్త గురించి స్పందించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

తన భార్య అనూజ గర్భవతి అయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అవినాష్ అన్నారు.ఒక వీడియోలో అవినాష్ అనూజతో అనూజ నిన్ను పనులు చెయ్యొద్దని చెప్పానా డాక్టర్ నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారని అసలే నువ్వు గర్భవతి అని చెప్పుకొచ్చారు.

చాలా యూట్యూబ్ ఛానెళ్లు అనూజ ప్రెగ్నెంట్ అని వార్తలు ప్రచారం చేస్తున్నాయని మేము ఫంక్షన్లకు వెళుతుంటే ఆ ఫంక్షన్లలో కూడా ఇదే విషయం అడుగుతున్నారని అవినాష్ అన్నారు.మా స్నేహితులు, బంధువులు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారని అవినాష్ చెప్పుకొచ్చారు.

మా అమ్మానాన్నలు కూడా ఈ విషయం గురించి ఫోన్ చేయడం మాకే షాకింగ్ గా అనిపించిందని అవినాష్ కామెంట్లు చేశారు.మాకు కూడా తెలియని ఈ విషయం గురించి మమ్మల్ని అడిగితే ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కాలేదని అవినాష్ తెలిపారు.

ఏదైనా శుభవార్త ఉంటే ముందుగా అభిమానులకు తెలియజేస్తాం అని అవినాష్ కామెంట్లు చేశారు.అభిమానులే మా ఫ్యామిలీ మెంబర్స్ అని అవినాష్ చెప్పుకొచ్చారు.

వైరల్ అవుతున్న న్యూస్ వల్ల అనూజ బయటకు వెళ్లడం లేదని అవినాష్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube