పోలీస్ ప్రొఫైల్ తో కాలింగ్...కంగారు పెట్టి కాసుల దోపిడీ

నల్లగొండ జిల్లా:ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు కేటుగాళ్లు రకరకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.ఇప్పుడు మరో కొత్త రకం దందాకు తెరలేపారు.

కొందరు అపరిచితులు పోలీస్ అధికారుల ఫోటోను డీపీగా పెట్టుకొని ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు ఏదో ఒక కేసులో పట్టుబడ్డారని,లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని,వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని భయపెట్టి,సదరు వ్యక్తులను టెన్షన్లో పెట్టి బెదిరించి బురిడీ కొట్టిస్తారు.మీకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే గుట్టు చప్పుడు కాకుండా మీ వాళ్ళని వదిలేస్తాను నేను చెప్పిన అమౌంట్ నా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడంతో అమాయకులు భయపడి వారు చెప్పినట్లు చేస్తూ మోసపోతున్నారు.

Extortion Of Money By Calling Kangaroo With Police Profile , Police Profile , I

అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది.

Advertisement

Latest Nalgonda News