అమెరికన్ల రక్తాన్ని విషపూరితం చేస్తున్నారు.. వలసదారులపై మరోసారి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) మరోసారి వలసదారులు, తన రాజకీయ ప్రత్యర్ధులపై దాడి చేయడానికి రెచ్చగొట్టే పదాలను వాడారు.అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం న్యూ హాంప్‌షైర్‌లోని( New Hampshire ) డర్హామ్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.

 Ex President Donald Trump Claims Rally Immigrants Are Poisoning The Blood Of Ame-TeluguStop.com

వలసదారులు మన దేశ రక్తాన్ని విషపూరితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.వారు ప్రపంచవ్యాప్తంగా వున్న మానసిక సంస్థలు, జైళ్లను విషపూరితం చేస్తారని ట్రంప్ అన్నారు.ఆఫ్రికా, ఆసియా నుంచి వారు మనదేశంలోకి వస్తున్నారని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

91 నేరారోపణలను ఎదుర్కొంటున్న ట్రంప్.గత అక్టోబర్‌లోనూ ఇదే తరహా పదాలను వాడారు.అమెరికన్ సమాజం క్రిములను ఇష్టపడదని.కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, ఫాసిస్టులు, రాడికల్ వామపక్ష దుండగులను నిర్మూలిస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.ఎన్నికలలో అబద్ధాలు చెప్పే, మోసం చేసే వారు క్రిమికీటకాల వంటి వారేనని ఆయన అభివర్ణించారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) ఖండించారు.ఒకప్పటి నాజీ జర్మనీలో వినిపించే బాషను ట్రంప్ ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

అలాగే ప్రముఖ జర్నలిస్ట్ మెహదీ హసన్ కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు.ట్రంప్ వెర్రీ, విపరీతమైన నియో నాజీ లాంటిదన్నారు.

రక్తాన్ని విషపూరితం చేయడం అనేది హిట్లర్ వాడిన భాష హసన్ వెల్లడించారు.

Telugu Donald Trump, Durham, Nazi Germany, Hampshire, America, Joe Biden, Republ

కాగా.2024 అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోన్న డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.సీఎన్ఎన్ ప్రకారం గతంలో అధ్యక్షుడిగా వున్నప్పటి కంటే మించి క్రూరమైన ఇమ్మిగ్రేషన్( Immigration ) విధానాలను అమలు చేయాలని చూస్తున్నారట.

ట్రంప్ కొత్త ప్రతిపాదనలలో ఇప్పటికే అమెరికాలో పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారులను బహిష్కరణకు సిద్ధమైన వారిని పంపే శిబిరాల్లో నిర్భంధించడం కూడా వుంది.

Telugu Donald Trump, Durham, Nazi Germany, Hampshire, America, Joe Biden, Republ

ఇకపోతే.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు( US Presidential Elections ) సంబంధించి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడుతున్న వారిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.రిపబ్లికన్ ఓటర్లలో సగానికి పైగా మంది మద్ధతును ఆయన పొందారు.సోమవారం నాటి రాయిటర్స్ ఇప్సోస్ ఓపీనియన్ పోల్ ప్రకారం .2024 రిపబ్లిన్ ప్రెసిడెంట్ నామినేటింగ్ పోటీలోత డొనాల్డ్ ట్రంప్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.61 శాతం మంది స్వీయ గుర్తింపు పొందిన రిపబ్లికన్‌లు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్‌ను ఎదుర్కోవడానికి ట్రంప్‌కు తమ ఓటు వేస్తామని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube