కొంతమంది వయసు పైబడిన సరే కష్టపడి పని చేస్తూ సొంతంగా బతకడానికి ఇష్టపడతారు.చివరి దశలో ఉన్న కూడా వారు పూలు, పాలు, ఇంకా బొమ్మలు ఊరురా తిరుగుతూ అమ్ముకుంటారు.
వృద్ధురాళ్లు కూడా ఏదైనా ఒక ప్రాంతాల్లో చిరు వ్యాపారం పెట్టి తమ కడుపు నింపుకుంటుంటారు.రోజంతా నిల్చుకొని బేరసారాలు ఆడే వారికి సమాధానం చెబుతూ అలా ఓపికతో వారు పండ్ల అమ్ముతారు.
అయితే ఒక ముసలావిడ కూడా ఇలా కష్టపడుతూ ఉండటం చూసి ఒక వ్యక్తి చలించిపోయాడు.ఆమెకు అతడు తన వంతుగా సహాయం చేయాలనుకున్నాడు.
ఈ దయగల వ్యక్తి ఆ వృద్ధురాలి స్టాల్ నుంచి అన్ని పండ్లను ఒకేసారి కొనుగోలు చేశాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.62 ఏళ్ల మహిళ మూడేళ్లుగా రోడ్డు పక్కన పండ్లు విక్రయిస్తోంది.ఆమె రోజుకు 12 గంటలు పని చేస్తుంది, కానీ జీవించడానికి మాత్రమే డబ్బులు సంపాదిస్తుంది.
ఒక్కోసారి ఆమెకు నిత్యవసరాలు కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు కూడా రావు.వీడియో విడుదలైన రోజున ఆమె సంపాదించింది కేవలం రూ.100 మాత్రమే.

అయితే సదరు మంచి వ్యక్తి ఆమెను సంప్రదించి ఆమె జీవితం గురించి అడిగాడు.అప్పుడు అతను ఆమె నుంచి అన్ని పండ్లను కొని రూ.3,000 ఇస్తానని ఆమెకు చెప్పాడు.మిమ్మల్ని సంతోషపెట్టాలని కోరుకుంటున్నానని, మీకు సహాయం చేయడానికి దేవుడు తనను పంపాడని చెప్పాడు.అతను ఆమె బండి నుంచి అరటిపండ్లు( Bananas ), నారింజ, ఆపిల్స్ అన్నీ కొని ఆమెకు డబ్బు ఇచ్చాడు.

అతను వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు, “ఈ వృద్ధురాలు తన చిన్న బండితో విచారంగా కూర్చోవడం నేను చూశాను.ఆమె నిన్న ఏమీ అమ్మలేదు, ఈ రోజు ఆమె కేవలం రూ.100 మాత్రమే సేల్ చేసింది.నేను ఆమెను ఉత్సాహంగా ఉంచాలనుకుంటున్నా.
కాబట్టి, అన్ని పండ్లను కొనాలని నిర్ణయించుకున్నా.ఆమె నన్ను చూసే విధానం ద్వారా నేను ఆమె బాధను, భావోద్వేగాలను తెలుసుకోగలను.” అని పంజాబ్( Punjab )లోని లూథియానాకు చెందిన ఈ వ్యక్తి పేర్కొన్నాడు.ఈ వీడియో చాలా మంది హృదయాలను తాకింది.
వారు ఆ వ్యక్తి దాతృత్వానికి ప్రశంసించారు.నీ సహాయతతో ఉన్న వృద్ధురాలికి సహాయం చేసిన నీకు జోహార్లు బ్రదర్ అని చాలామంది పేర్కొన్నారు.
బ్రదర్ కలకాలం పాటు సంతోషంగా జీవించు అని మరికొందరు అతడిని ఆశీర్వదించారు.ఈ హార్ట్ టచింగ్ వీడియో ని మీరు కూడా చూసేయండి.







