సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం...!

నల్లగొండ జిలా:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దాదాపు ఏడాదిగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుదారులకు ఈ ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది.

సన్నబియ్యం పథకానికి సిఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నారు.

Everything Is Ready For The Distribution Of Fine Rice, Distribution Of Fine Ric

డీలర్ల వద్ద నిలువ ఉన్న దొడ్డు బియ్యం మొత్తం వెనక్కి పంపించాలని సర్కార్ ఆదేశించి,ఈ మేరకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది.ఇప్పటికే గోదాముల్లో సన్న బియ్యం దించింది.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రేషన్ షాపులకు తరలించి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.

Advertisement

Latest Nalgonda News