107 మంది అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు

నల్లగొండ జిల్లా: శాసనసభ ఎన్నికల వేళ రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతా వేటు పడిన వారి జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) ప్రకటించింది.

గత శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి అనర్హులుగా వేటుపడ్డ వారి పేర్లు జాబితాలో ఉన్నాయి.

రాష్ట్రం నుంచి మొత్తం 107 మంది ఈ జాబితాలో ఉన్నారు.ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద వారిపై అనర్హతా వేటు పడింది.

EC Has Disqualified 107 Candidates-107 మంది అభ్యర్థుల�

ఎన్నికల్లో పోటీ చేసి ఆ తర్వాత అందుకు సంబంధించిన ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించకపోతే ఈ సెక్షన్ కింద అనర్హతా వేటు వేస్తారు.గత శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు వివరాలను ఇవ్వని 107 మందిని కేంద్ర ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించింది.

ఇందులో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనర్హతా వేటుపడ్డ వారే అధికంగా ఉన్నారు.రాష్ట్రంలోని ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన 72 మంది అభ్యర్థులపై ఈ తరహా అనర్హతా వేటు పడింది.

Advertisement

ఒక్క నిజామాబాద్ నుంచే అనర్హత వేటు పడ్డ అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంది.ఇక్కడ గత లోక్ సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు.

అందులో 68 మంది ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వకపోవడంతో వారిపై ఈసీ అనర్హతా వేటు వేసింది.వీరితో పాటు మెదక్,మహబూబాబాద్( Medak ) లోక్ సభ నియోజకవర్గాల నుంచి ఒకరు చొప్పున, నల్గొండ నుంచి ఇద్దరిపైన వేటు పడింది.2021 జూన్ నుంచి వీరిపై అనర్హతా వేటు పడగా 2024 జూన్ వరకు వీరికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మందిపైనా ఇదే తరహాలో అనర్హత వేటు పడింది.

వారు కూడా ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద అనర్హులుగా ప్రకటించారు.పాలకుర్తి నియోజకవర్గం( Palakurthi Assembly constituency ) నుంచి ఆరుగురు, దేవరకొండ నుంచి ఐదుగురు,నల్గొండ, ములుగు నుంచి నలుగురు చొప్పున ఈ జాబితాలో ఉన్నారు.మిర్యాలగూడ నుంచి ముగ్గురు,నకిరేకల్ నుంచి ఇద్దరు,జుక్కల్, రామగుండం,కరీంనగర్, గజ్వేల్,మల్కాజ్‌గిరి, నాగార్జునసాగర్,ఆలేరు, జనగాం, మహబూబాబాద్, మల్కాజ్ గిరి,డోర్నకల్ నియోజకవర్గాల నుంచి ఒకరు చొప్పున వేసింది.2021 జులై,ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీరిని అనర్హులుగా ప్రకటించారు.మూడేళ్ల పాటు అంటే 2024 జులై,ఆగస్టు, సెప్టెంబర్ వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!
Advertisement

Latest Nalgonda News