మీకు ఈ ఆట గుర్తుందా? అయితే చెప్పుకోండి చూద్దాం!

మీకు ఈ ఆట గుర్తుందా? అయితే చెప్పుకోండి చూద్దాం.ఈ ఆట పేరు ఏంటో? ఎలా ఆడుతారో? మన చిన్నప్పుడు ఇలాంటి ఆటను ఎంతో ఇష్టంగా ఆడేవారు.

కానీ ప్రస్తుత కాలానికి అనుగుణంగా పిల్లలు కేవలం స్మార్ట్ ఫోన్ లకు మాత్రమే అంకితం అయిపోయారు.

పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తుంటాయి.ఒక అరగంట పాటు చేతిలో సెల్ లేకపోతే ఏమీ తోచదు.సెల్ నుంచి ఆన్లైన్ గేమ్లను ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు.10 సంవత్సరాల క్రితం ఆడిన ఏ ఆటలను కూడా ప్రస్తుత కాలంలో పిల్లలు ఆడటం లేదు.కనీసం ఎలా ఆడుతారు అన్న విషయాలు కూడా ఏమీ తెలియవు.

అయితే ప్రస్తుతం ఒక ఐపీఎస్ అధికారి ఒక ఆట ఫోటో ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఈ ఆట గుర్తుందా? ఈ ఆట పేరు చెప్పగలరా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీపాన్స్‌ కాబ్రా అనే ఒక ఐపీఎస్ అధికారి తన పాత కాలం నాటి ఓ ఆటకు సంబంధించిన ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ ఆట గురించి తెలుసా అని అడగడం ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు ఈ ఆటను చిన్నప్పుడు బలే ఆడుకునే వాళ్ళం.

Advertisement

ఈ ఆట నాకు ఎంతో ఇష్టమైన ఆట అంటూ కామెంట్ చేయడం విశేషం.అయితే ఇప్పటి పిల్లలకు ఇటువంటి ఆటల గురించి ఏమాత్రం తెలియదు.

కేవలం ఆన్లైన్ ఆటలలో పూర్తిగా నిమగ్నమై ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.కానీ పాతకాలంనాటి ఆటలను ఆడటం ద్వారా శారీరక ఉల్లాసం కలుగుతుంది.

సాయంత్రం అయ్యే సరికి వీధిలోని పిల్లలందరూ కలిసి ఎంతో సంతోషంగా రకరకాల ఆటలు ఆడుకునేవారు.అలాగే వారి మధ్య ఎంతో స్నేహ భావం ఏర్పడింది.

కానీ ప్రస్తుత పిల్లలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి కూడా పట్టించు కోకుండ కేవలం సెల్ఫోన్ కు మాత్రమే పరిమితమవుతున్నారు.ఐపీఎస్ అధికారి షేర్ చేసిన ఆ ఆటను ఇద్దరు పిల్లలు చేతులు పైకి పట్టుకొని మరి కొందరు పిల్లలు ఒకరి వెనుక ఒకరు పట్టుకుని, వారి చేతుల కింద పాట పాడుతూ వెళ్తూ ఉంటారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

పాట పాడడం పూర్తయిన తర్వాత వారి చేతులు కిందికి దించగానే ఆ చేతుల మధ్య ఎవరైతే ఉంటారో వారు అవుట్! అని అర్థం.ఇలా ఈ ఆటను ఆడుతూ ఉంటారు.

Advertisement

అయితే ఈ ఆటను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు.మీరు కూడా మీ గతజ్ఞాపకాల లోకి వెళ్లి ఎలాంటి ఆటలు ఆడేవారో గుర్తు తెచ్చుకోండి! అయితే ఈ ఫోటో మాత్రం ఎంతోమందికి వారి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

తాజా వార్తలు