సినీ జనాల్లో వివాహ బంధం గురించి జనాల్లో అంత మంచి అభిప్రాయం లేదనేది వాస్తవం.వారు నచ్చితే కలిసి ఉంటారు.
నచ్చకపోతే విడిపోతారు.ప్రేమ అయినా.
బ్రేకప్ అయినా.పెళ్లయినా.
విడాకులైనా.బంధాలను ఎంతో తేలికగా తెంచుకుంటారు.
కారణం.సినిమా అనే రంగుల ప్రపంచంలో వారు ఉండటం.
ఒకరుపోతే మరొకరు అనే చీప్ భావన కలిగి ఉండటం.ఈమె కాకపోతే మరొకరు.
ఇతడు కాకపోతే ఇంకొకడు అనే ఫీలింగ్.అందుకే సినిమా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కాలం నిలబడిన సందర్భాలు చాలా తక్కువ.
అంతేకాదు.సినీ హీరోలు తమ భార్యలకు ఎక్కువ విలువ ఇవ్వరనే వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి.భార్యలకు తెలియకుండా రకరకాల పనులు, రకరకాల వ్యవహారాలు నడుపుతారనే టాక్ ఉంది.అన్ని విషయాలను ఇంట్లో వారికి చెప్పాల్సిన అవసరం లేదు అనుకునే వారు చాలా మంది ఉన్నారు.
అగ్ర హీరోలతో పాటు అగ్ర దర్శకులు, అగ్ర సంగీత దర్శకులు కూడా ఇదే ఒపీనియన్ తో ఉన్నారు.
కానీ.
వీరిందరికీ పూర్తిగా విరుద్ధ మనస్తత్వంతో ఉంటాడు దిగ్గజ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా.అన్ని విషయాలను భార్యకు చెప్పిన తర్వాత చేయడం ఈయన పద్దతి.
సినిమాలు కూడా భార్యకు చెప్పిన తర్వాతే ఓకే చెప్తాడట.ఏ పని కూడా చెప్పకుండా చేయడట.ప్రతి విషయంలోనూ తన సలహాలు తీసుకుంటాడట.ఆర్థిక వ్యవహారాలు కూడా తన భార్యకే అప్పగించాడట ఇళయరాజా.తన భార్య ఏం కావాలి అని అడిగినా తనే దగ్గరుండి ఆ పనులు చూస్తాడడట.ఆయనను ఏ వేడుకకు పిలవడానికి వచ్చినా.
భార్యభర్తలిద్దరూ కలిసి రావాలని ఆహ్వానిస్తారట చాలా మంది.అంతేకాదు.
ఏ వేడుకకు వెళ్లినా భార్య భర్త కలిసే వెళ్తారట.భార్య అంటే అమితమైన గౌరవాన్ని ఇస్తాడు ఇళయరాజా.
ఈ దంపతులను చూసి అందరూ సంతోష పడటమే కాదు.వారి ఆదర్శంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తారట.