చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో సింగర్ గా కెరీర్ ను కొనసాగిస్తూ తన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న వాళ్లలో సింగర్ సునీత ఒకరనే సంగతి తెలిసిందే.ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సునీత పెళ్లి తర్వాత సంతోషకరమైన జీవనం గడుపుతున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన రెండో పెళ్లి గురించి సునీత చెబుతూ తాను ఎవరి గురించి పట్టించుకోనని చేయాల్సిన పనిని చేస్తానని ఆమె అన్నారు.
తనకంటూ గుర్తింపు ఉందని తాను ఒక మంచి సింగర్ కావడంతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని సునీత అన్నారు.పెళ్లి కాకముందు తనతో మాట్లాడేవారు పెళ్లి తర్వాత మాట్లాడటం మానేశారని సునీత చెప్పుకొచ్చారు.
తాను ఎవరినీ పట్టించుకోనని తాను పెళ్లి చేసుకోవడం చాలామందికి ఇష్టం లేదని సునీత వెల్లడించారు.
సొసైటీలో మనకంటూ ఒక ప్రాణం ఉందని ఒక మనస్సు ఉందని చాలామంది తెలియదని సునీత అన్నారు.తాను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే చాలామందికి సంతోషమని సునీత చెప్పుకొచ్చారు.తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించినప్పుడు గుండె పగిలిందని చాలామంది కామెంట్లు చేశారని సునీత తెలిపారు.
తన కుటుంబ సభ్యులకు తన పెళ్లి గురించి తెలుసని పెళ్లి గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె కామెంట్లు చేశారు.
తడ్డిగుడ్డతో గొంతు కోసిన రిలేషన్స్ ను చూశానంటూ సునీత సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.సునీత చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా సునీత కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు సింగర్ గా సునీత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
సునీత తన కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకుంటూ అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.