ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దు:మంత్రి

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయకుండా వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించాలన్నారు.

వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చే పరిస్థితి ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ముఖ్యంగా విద్యుత్తు అధికారులు,ఇతర జిల్లా యంత్రాంగం,అన్నిశాఖల అధికారులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందిలో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Do Not Do Politics In Such Situations: Minister-ఇలాంటి పరిస�

ఇలాంటి పరిస్థితుల్లో వీలైతే ప్రజలకు సహకరించాలి తప్ప రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

Advertisement

Latest Nalgonda News