ఎస్ సేవ అధ్వర్యంలో విద్యార్దులకు,తల్లిదండ్రులకు హెల్మెట్లు పంపిణీ

నల్లగొండ జిల్లా: ఎస్ సేవ వ్యవస్థాపకులు ఎంఏ బేగ్ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్దులకు,బైక్ ఉండి లైసెన్స్ కల్గిన వారి తల్లిదండ్రులకు ఉచిత హెల్మెట్‌లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్ సేవ వ్యవస్థాపకులు ఎంఏ బేగ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై తల్లిదండ్రులలో పాటు పాఠశాలకు వెళ్ళే విద్యార్దులు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తగిలే తీవ్రమైన గాయాల నుండి తమను తాము రక్షించుకోవడానికి హెల్మెట్‌ ఉపయోగపడుతుందని వివరించారు.పిల్లలు మరియు తల్లిదండ్రులకు రైడింగ్ సమయంలో లేదా పిలియన్ రైడర్‌లకు తోడుగా ఉండే హెడ్ సేఫ్టీ గేర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.

Distribution Of Helmets To Students And Parents Under The Auspices Of SSeva Foun

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమానాయక్,ఏఎస్ఐ సత్తు రామయ్య,స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఆర్.రవి నాయక్,ఉపాధ్యాయులు డి.సత్యనారాయణ,వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News