పశువుల డాక్టర్ పని తీరుపై రైతుల అసంతృప్తి

నల్లగొండ జిల్లా: పీఏ పల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాల డాక్టర్ మహేందర్ రెడ్డి రూటే సపరేటు,సారువారు ఎప్పుడు డ్యూటీకి వస్తారో,ఎప్పుడు డుమ్మా కొడతాడో ఎవరికీ తెలియదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విధులకు హాజరు కాకుండా,అయినా సమయపాలన పాటించకుండా వచ్చిన రోజే రిజిస్టర్ లో అన్ని సంతకాలు చేసుకొని, వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వారానికి ఒక్కసారి కూడా విధులకు రావడం లేదని,రోగాల బారిన పశువులను పాడి రైతులు ఆసుపత్రికి తీసుకెళితే వైద్యశాలకు తాళం వేసి ఉంటుందని, స్థానిక ప్రజాప్రతినిథులు సపోర్ట్ తోనే వైద్యాధికారి ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ డాక్టర్ సమయానికి రాకపోవడంతో చేసేదేమీ లేక ప్రైవేటు మెడికల్ షాపులలో మందులు కొనుగోలు చేసి వాటికి ప్రథమ చికిత్స చేస్తున్నామని వాపోతున్నారు.ప్రభుత్వ పశు వైద్యాధికారికి జీతం ఇస్తూ,ప్రైవేట్ మెడికల్ షాపులను పోషిస్తున్నారని, ప్రభుత్వం పశువైద్యశాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నప్పటికీ మండల స్థాయి అధికారులు ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని, అయినా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా అధికారులకే వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.1962 వాహనానికి ఫోన్ చేస్తే కూడా ఎలాంటి స్పందన ఉండదని,డాక్టర్ అందుబాటులో లేక పశువుల మరణాలు పెరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పాడి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, పశు వైద్యాధికారి సమయపాలన పాటించి సక్రమంగా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Dissatisfaction Of Farmers With The Work Of Cattle Doctor, , Farmers , Cattle Do

Latest Nalgonda News