అనిల్‌ రావిపూడి కి టెన్షన్ టైమ్‌.. మళ్లీ విజయ ఢంకా మ్రోగేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శంఖం సినిమా( Shankham movie ) తో రచయితగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకుడిగా సినిమాలు చేయడానికి చాలా సమయం పట్టింది.అనిల్ రావిపూడి ని నమ్మి నందమూరి కళ్యాణ్ రామ్‌ పటాస్ ఛాన్స్ ఇచ్చాడు.

 Director Anil Ravipudi Going To Face Tension With Bhagavanth Kesari Movie , Bh-TeluguStop.com

దక్కిన మొదటి ఛాన్స్ ని సద్వినియోగం చేసుకున్న అనిల్ రావిపూడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.హీరో ఎవరైనా కూడా విజయం సాధిస్తూ దూసుకు పోయాడు.

సరిలేరు నీకెవ్వరు వరకు అంటే వరుసగా అయిదు సినిమా లతో విజయాలను సొంతం చేసుకున్నాడు.అపజయం అంటే తెలియని దర్శకుడు అంటూ పేరు దక్కించుకున్న అనిల్‌ రావిపూడికి ఎఫ్ 2 సీక్వెల్‌ మూవీ ఎఫ్ 3 గట్టి షాక్ ఇచ్చింది.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

Telugu Anil Ravipudi, Balakrishna, Telugu, Top-Movie

ఏమాత్రం వసూళ్లు సాధించలేదు.సినిమా కి పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా వసూళ్ల విషయం లో నిరాశ మిగిలింది.దాంతో అనిల్ రావిపూడి టైమ్ ఏమాత్రం బాగా లేదు అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో బాలయ్య తో కలవడం ఆయన కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అనీల్‌ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య హీరోగా భగవంత్‌ కేసరి సినిమా( Bhagwant Kesari movie ) రూపొందింది.

ఈ ఏడాది లోనే సినిమా ను ప్రారంభించినా కూడా చాలా స్పీడ్‌ గా షూటింగ్‌ ను పూర్తి చేసి వచ్చే వారం లో విడుదల కు సిద్ధం చేశారు.దసరా కానుకగా రాబోతున్న భగవంత్ కేసరి సినిమా ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆకట్టుకునే అందం తో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న శ్రీలీలను( sreeleela ) ఈ సినిమా లో బాలయ్య కు కూతురు పాత్ర లో దర్శకుడు అనిల్‌ చూపించబోతున్నాడు.మరి ఆ ప్రయోగం ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.

మొత్తానికి ఈ సినిమా తో తన విజయాల పరంపర కొనసాగించే విధంగా సక్సెస్ ను దక్కించుకుంటాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube