నిబంధనలు ఉన్నా కట్టలు తెగిన కరెన్సీ...!

నల్లగొండ జిల్లా:2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థంకాకపోయినా నల్లగొండ జిల్లా సాగర్ నియోజకవర్గ పరిధిలోని 6 ఆరు మండలాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడి రూ.70 కోట్ల నుంచి రూ.

100 కోట్ల వరకు పంచడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వినికిడి.ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేసే అవకాశం ఉందని,ఇప్పటికే పోలీసుల కంటపడకుండా కీలక నేతల ఇళ్ళకు డబ్బు సంచులు చేరినట్లు,ఈనెల 30 న పోలింగ్ ఉండడంతో 28,29 తేదీల్లో డబ్బులతో పాటు మందు పంచే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతుంది.ఒకవేళ ఎక్కడన్నా పోలీసులకు దొరికినా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వైపు నుంచి ఓటర్లకు డబ్బు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్లు, అవసరమైతే రెండో విడత పంపిణీకి కూడా ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది.

జనరల్ ఎలక్షన్స్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా ఓటుకు నోటు పంపిణీ చేస్తూ పోతే, భవిష్యత్ లో సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా చేసే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.రాజకీయాలు పెద్దమొత్తంలో కమర్షియల్ గా మారుతున్నా ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేని స్థితికి నెట్టివేయబడిందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని,ఈ పరిస్థితిని ప్రక్షాళన చేయకపోతే రాబోయే కాలంలో ఎన్నికలు మరింత ఖరీదైనవిగా మారి,దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..

Latest Nalgonda News