తెలంగాణ ప్రజలను అయోమయంలో పడవేసిన వార్త.మరోసారి ఈ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తారా ? లేదా ? ఇప్పటికి ఈ విషయంలో ఎలాంటి క్లారీటి లేదు.కాని సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణలో త్వరలో లాక్‌డౌన్ ప్రకటించే అవకాశం ఉందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వమే ఒక నిర్ణయానికి రాలేదు కానీ మే 2వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్రం ఆ దిశగా అడుగులు వేయవచ్చని ప్రచారం.
ఇదిలా ఉండగా తెలంగాణలో లాక్‌డౌన్‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు నిన్న పేర్కొన్న సంగతి తెలిసిందే ఇక తెలంగాణ పోలీస్ శాఖ కూడా ఈ లాక్ డౌన్ వార్తలను ఖండించినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో రెండు రోజుల్లో నిర్వహించే సమీక్ష తర్వాత లాక్‌డౌన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మరో ప్రచారం జరుగుతుంది.
కాగా ఈ సమావేశం తర్వాతనే లాక్‌డౌన్ విధించడమా లేదా కఠిన ఆంక్షలతో కరోనాను కట్టడి చేయడమా అనే దానిపై పై స్పష్టత రానున్నట్లుగా సమాచారం.