ఏం అభివృద్ధి సాధించారని దశాబ్ది ఉత్సవాలు...!

నల్లగొండ జిల్లా

:ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటి నుండి నేటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( Kalvakuntla Chandrasekhar Rao ) తెలంగాణ ప్రజలకు అనేక అబద్దాలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి( Priyadarshini Medi ) అన్నారు.

శనివారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు,నల్ల బెలూన్స్ ఎగురవేసి నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన యోధుల కుటుంబాలను కేసీఆర్ మరిచిపోయారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన యోధుల కుటుంబ సభ్యులకు,పోరాటం చేసి పోలీసు కేసుల పాలైన తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే ఫించన్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని( Telangana State Govt ) డిమాండ్ చేశారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 10 ఏండ్లు గడుస్తున్నా పేదలకు ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూం ఇండ్లు,సొంత ఇంటి స్థలం కలిగి వున్న పేదలకు పక్క ఇండ్లు కూడా నేటికి దక్కలేదని,డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని,మూడెకరాల భూమి,రైతులకు ఉచిత ఎరువులు,రుణమాఫీ, నిరుద్యోగ భృతి,57 ఏండ్ల నిండిన వారికి ఫించన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరైంది కాదన్నారు.

ఏండ్ల తరబడి గ్రామ పంచాయితి, మున్సిపల్ లో పని చేస్తున్న పారుశుద్య కార్మికులు,అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని,దళిత బంధు పధకం పూర్తిగా మరిచి పోయారని ఎన్నికల హామీలను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తక్షణమే అమలు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.కేసీఆర్ ఎన్నికల హామీలను అమలు చేయకుంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్తున్న ఎమ్మెల్యే రోడ్లు,సిసి రోడ్లు, వీధి లైట్లు వేసి అభివృద్ధి అని అనడం సిగ్గు చేటని అన్నారు.నకిరేకల్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేసి ఓట్లు అడగాలన్నారు.

Advertisement

లేనిపక్షంలో ప్రజలే మీకు బుద్ది చెపుతారని హెచ్చరించారు.

Advertisement

Latest Nalgonda News