సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ: ఎస్పీ చందనా దీప్తి

నేర నియంత్రణ,మెరుగైన సమాజ నిర్మాణం కొరకు సిసిటివి కెమెరాల( CCTV Cameras ) ప్రాముఖ్యత చాలా అవసరమని,జిల్లాలో అన్ని ప్రాంతాలలో ప్రతి చోటా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే నేర నియంత్రణ అరికట్టవచ్చని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి( Nalgonda SP Chandana Deepti ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పరిధిలోని పోలీసు శాఖ తీసుకుంటున్న సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తూ గ్రామాలు, పట్టణంలోని వ్యాపార సముదాయాలు,రహదారి కూడళ్ళలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా దాతలు ముందుకు రావాలన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని,వీటిని ప్రతి ప్రాతంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని, అనేక కేసులు ఛేదించడంలో, దొంగతనాలు,రోడ్డు ప్రమాదాల( Road Accidents ) మరియు ఇతర నేరాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి బాధితులకు న్యాయం చేయడం జరిగిందన్నారు.ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయన్నారు.

Crime Control Through Installation Of CC Cameras Says SP Chandana Deepti,SP Chan

Latest Nalgonda News