నల్లగొండ జిల్లా:గాంధీజీ కలలుగన్న సామరస్యం, సమానత్వాన్ని చంపుతున్న గాడ్సే మతోన్మాదాన్ని ఓటు అనే ఆయుధంతో చంపేద్దామని,గాంధీజీ మానవతవాదాన్ని బతికిద్దామని,కమ్యూనిస్టులే గాంధీజీ కలల సాకారపు ప్రజాపోరు వారసులని, గాంధీజీ స్ఫూర్తిని కొనసాగిద్దామని,గాడ్సే ముఠాను మూసీలో సజీవంగా బొంద పెట్టండడని దేశభక్తులకు, దేశాభిమానులకు వ్రాసిన బహిరంగ లేఖలో ఎంఎల్ పార్టీ కార్యదర్శి బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ సూచించారు.
మహాత్మ గాంధీజీని మహాత్ముడని,జాతి పిత అని దేశమంతా కొనియాడే కాలంలో లేము.
గాంధీజీని హతమార్చిన గాడ్సేని దేశభక్తుడని స్వయంగా పార్లమెంటు సభ్యులు (బీజేపీ వారు) నిస్సిగ్గుగా మాట్లాడుతున్న కాలంలో వున్నాం.గాంధీజీ వర్థంతి రోజున ఆయన బొమ్మను పిస్తోలుతో కాల్చి గాడ్సే జిందాబాద్,గాంధీ మురదాబాద్‌అని వికృతంగా కేకలు పెట్టి,ఈ మొత్తం తతంగాన్ని సోషల్ మీడియాలో పెట్టిన ప్రజ్ఞా ఠాకూర్‌ని మధ్యప్రదేశ్‌లో ప్రజలు పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న కాలానికి చేరాం.
గాంధీజీని ఆరాధించే వాళ్ళు పొగిడి,ఆయనని హతమార్చిన వాళ్ళూ పొగడడంలో స్వాతంత్రోద్యమానికి తిరుగులేని నాయకత్వం వహించిన ఆయన గురించి,నాటి స్వాతంత్రోద్యమం గురించి దేశానికి తెలియకుండా చేయాలన్న కుట్ర ఇమిడి ఉందని ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి సుభాషన్న తెలిపారు.అందువలన పొగడ్తలు సరిపోవు,గాంధీజీ జీవితాన్ని,ఆయన సిద్ధాంతాలను చదవాలి,అంతేకాదు నేటి తరానికి వివరంగా చెప్పాలి,అప్పుడే ఆయన్ని హతమార్చి,ఆయన సిద్ధాంతంపై విషం కక్కుతూ నేడు అందలమెక్కిన వారి అంతు చూడగలం.
ఈ క్రమంలో గాంధీజీ వారసులుగా చెప్పుకునే వారి గురించి కూడా చెప్పుకోవాలి.అలాగే స్వాతంత్రోద్యమంపై గాంధీజీ తిరుగులేని ప్రభావం,ఆయన సిద్ధాంతం,దాని వర్గ స్వభావం,స్వాతంత్య్రానంతరం జరుగుతున్న పరిణామాలన్నింటినీ తెలుసుకోవాలని విద్యార్థి యువజన శక్తులను బోరన్న గారి సుభాషన్న కోరారు.
హైదరాబాద్ లోని గాంధీ జ్ఞానమందిరంలో (1957వ సంవత్సరంలో) కామ్రేడ్ సుందరయ్య చేసిన ప్రసంగంలో మహాత్మా గాంధీ నిరంతరం హిందూ-ముస్లిం ఐక్యత కోసం కృషి చేస్తూ వచ్చారు.ఆఖరికి ఆ కృషిలోనే ఒక హిందూ మతోన్మాది చేతులో తుపాకి కాల్పులకు బలయ్యారని ఉందని బహుజన బంధువు బోరన్నగారి సుభాషన్న బాధపడ్డారు.
సమానత్వం అనేది గాంధీ సిద్ధాంతాలలో కీలకం.దక్షిణాఫ్రికాలో తెల్లవారితో నీగ్రోల సమానత్వం, చంపారన్ (బీహార్) లో రైతుల సమానత్వం,అన్ని కూలాల వారి సమానత్వం,హిందూ ముస్లింల సమానత్వం,ఆర్థిక అసమానతలు తొలగించి సమానత్వం సాధించడం కోసం మొత్తం ఆయన జీవితమంతా సమానత్వం కోసం పోరాడారు.
సమానత్వమనేది ఆయన నడిపిన ఉద్యమాలన్నింటికీ కీలక బీజం.ఈ సమానత్వం సాధించాలనే కర్తవ్యం ఇంకా మిగిలే వుంది.
దాన్ని సాధించాలి.అలా సాధించినప్పుడే గాంధీజీ ఆశయాలు నెరవేర్చిన వారమవుతామని చెప్పారని ఎంఎల్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్నగారి సుభాషన్న తెలిపారు.
ఆ ప్రసంగంలోనే ఆయన స్వాతంత్య్రం సాధించడానికి గాంధీయిజం పునాదులు వేసింది.స్వాతంత్య్రం అనే మన ఆశయాన్ని సాధించడంలో గాంధీజీ ప్రముఖ పాత్రను కమ్యూనిస్టులు గుర్తిస్తారు.
కానీ,అంత వరకు మాత్రమే.గాంధీజీ సిద్ధాంతాలు అంతకు మించి ముందుకు పోవడానికి తోడ్పడవు అని తేల్చిచెప్పారు.
నిజానికి గాంధీజీనే స్వాతంత్య్రం వచ్చిన తీరు, ముఖ్యంగా దేశ విభజన ఆ సందర్భంగా భయానకమైన మత కలహాలు,మారణకాండ, స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ నాయకుల విపరీత ధోరణులపై తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.రాజ్యాంగ సభకు సభ్యులుగా వుండగోరే వారి నుంచి నాకెన్నో ఉత్తరాలు వస్తున్నాయి.
ఈ ఉత్తరాలు మేధావి వర్గానికి దేశ స్వాతంత్య్రం మీద కంటే స్వంత లాభాల మీదనే దృష్టి వున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.ఇది చూస్తే భయం వేస్తోంది.
ఈ దరఖాస్తులు ఒక జబ్బుకు లక్షణం.ఈ విషయంలో నా సహాయం కోరవద్దని చెప్పడం కంటే రోగ లక్షణాల్ని ప్రజలకు చూపించడానికేననేది వ్రాస్తున్నాను.
అని ప్రకటించారు.గాంధీజీ అనుచరులందరూ స్వాతంత్య్ర ఉత్సవాలు చేస్తుంటే ఆయన భారత రాజకీయ పరిస్థితులు అస్థిరంగా వున్నాయని కలత చెందారు.
అదే విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు.ఈ అస్థిర పరిస్థితులకు కారణం-హిందూ,ముస్లిం తగాదాలు.
అవి ఇండియా,పాకిస్తాన్‌ల మధ్య తగాదాలుగా రూపం తీసుకోవడం.రెండవది కాంగ్రెస్ సంస్థలో ప్రవేశించిన కుళ్ళు,పతనము.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన బతికి వున్నది కేవలం ఐదున్నర నెలలు మాత్రమే.కానీ,ఆయన గొప్పతనమేంటంటే ఆ అతికొద్ది కాలంలోనే భారతదేశ భవిష్యత్ ఎలా వుండబోతున్నదో అర్థం చేసుకోవడం,ప్రజల్ని హెచ్చరించడం,చివరకు భగవంతుడి మీద భారం వేయడం తప్ప ఆయనకు మరో దారి తోచలేదు.1947లో తన జన్మదినం సందర్భంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు హిందువైనా,ముస్లిం అయినా మరొకరయినా పరమ కిరాతకంగా సాగించే ఈ హత్యాకాండను చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చునే పరిస్థితిలో నన్ను పెట్టే కన్నా ఈ దు:ఖమయ ప్రపంచంలో నుండి తీసుకుపోవాల్సిందిగా సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. అని చెప్పారు.
(మహాత్ముడు ఆయన సిద్ధాంతాల నుండి).ముంచుకొస్తున్న మతోన్మాద గండాన్ని మూసీ నదిలో కలుపుదాం.
స్వాతంత్య్రానంతరం గడచిన 75 సంవత్సరాలను రెండు భాగాలుగా చూడొచ్చు.ఒకటి హిందూత్వ శక్తులు బలపడటానికి ముందు అంటే 1992 (బాబ్రీ మసీదు విధ్వంసం 1992 డిసెంబరు 6), ఆ తరువాతగా చూడొచ్చు.
గాంధీజీ వ్యక్తం చేసిన భయాందోళనలను బట్టి చూసినప్పుడు ఈ రెండూ విడిభాగాలు కాదు.పరస్పరం కలిసి వుండేవి.
మొదటి దశ కొనసాగింపుగానే రెండవ దశను చూడటం అవసరం.అప్పుడే గాంధీజీ సిద్ధాంతానికి ఆయన సహచరులు,అనుచరులు చేసిన అపారనష్టం ఆ నష్టాన్ని వినియోగించుకుంటూ హిందూత్వ శక్తులు తమ విష ప్రచారాన్ని వందలు,వేల రెట్లు ఎలా పెంచుకుంటూ పోయాయో అర్ధం అవుతుందని అభ్యుదయ వాది బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
గాంధీజీని చంపినా గాడ్సే గ్యాంగ్ వారి లక్ష్యం ఇంకా నెరవేరలేదు.గాంధీ మహాత్ముడి హత్యకూ తమకు ఏ సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత ఎం.ఎస్.గోల్వాల్కర్ అంటాడు.1947 డిసెంబర్‌లో గాంధీజీ హత్యకు కొద్ది రోజుల ముందు ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో చేసిన ఉపన్యాసంలో గోల్వాల్కర్ ఏమన్నాడో చూడండి.ఈ భూమి మీద వున్న ఏ శక్తి ముస్లింలను హిందూస్తాన్‌లో నిలపలేదు.
వాళ్ళు ఈ దేశం వదిలి పోవాల్సిందే.ఎన్నికల్లో వారి ఓట్లతో కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని మహాత్మా గాంధీ వాళ్ళను ఈ దేశంలో వుంచాలనుకుంటున్నారు.
కానీ,అప్పటికి ఒక్క ముస్లిం కూడా ఇండియాలో వుండడు.గాంధీ వాళ్ళని ఇంక ఏ మాత్రం మోసగించలేడు.
ఇటువంటి వ్యక్తుల్ని శాశ్వతంగా నోరు మూయించే పద్ధతులు మన దగ్గర వున్నాయి.కానీ,హిందువులకు హాని కలిగించని సాంప్రదాయాలు మనవి.
మనకు తప్పకపోతే అటువంటి చర్యలకు కూడా పోవాల్సి వుంటుంది.గాంధీజీని నిర్మూలించడం ద్వారా లౌకిక ప్రజాతంత్ర రాజ్యాన్ని అంతం చేసి తీరుతామన్న హెచ్చరిక ఆర్‌ఎస్‌ఎస్ పంపింది.
గాంధీజీ హత్యపై రోధించిన దేశం,గాడ్సేని ఆర్‌ఎస్‌ఎస్‌ని అసహ్యించుకున్న దేశం, గాంధీ సిద్ధాంతం గురించి,ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమైన హిందూత్వం గురించి తీవ్రంగా తీసుకోలేదు.గాంధీజీపై కొద్దికొద్దిగా విషం కక్కిన హిందూత్వ శక్తులు ఈ రోజు బలపడిన తరువాత పూర్తి స్థాయిలో ఆయన పైన, ఆయన సిద్ధాంతాలపైన విషం కక్కుతున్నాయి.
దేశం మనస్సులో నుండి గాంధీజీ స్థిరత్వాన్ని తుడిచిపెట్టే పనిలో పడింది ఆర్‌ఎస్‌ఎస్.అందుకోసమే గాంధీజీ హత్య కేసులో కుట్రదారుడు నెం.1 అయిన వి.డి.సావర్కర్‌ని ఆకాశానికి ఎత్తుతున్నది.గుజరాత్ లోని నర్మదా వ్యాలీలో 597 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రతిష్టించింది అక్కడ బిజెపి రాష్ట్ర ప్రభుత్వం.
నిజానికి గుజరాత్ జాతీయుడి విగ్రహం పెట్టాలనుకున్నా, స్వాతంత్య్రోద్యమానికి తిరుగులేని నాయకుడైనా గాంధీజీ అవుతారు కదా! లేకుంటే తొలి ప్రధాని నెహ్రూ విగ్రహం పెట్టాలి కదా! కారణమేమంటే గాంధీజీ చాలా స్పష్టంగా హిందుత్వ సిద్ధాంత మూలాలను అసహ్యించుకునే వారు.గాంధీజీ మిత్రుడు ఆర్‌ఎస్‌ఎస్ వారి సేవా కార్యక్రమాల్ని ఆయన వద్ద పొగిడితే గాంధీజీ వెంటనే హిట్లర్,ముస్సోలినీ, ఫాసిస్టులు కూడా ఈ విధంగానే చేసే వారిని మర్చిపోకూడదు.
ఆర్‌ఎస్‌ఎస్ అనేది నిరంకుశ మతోన్మాద సంస్థ అని హెచ్చరించారు.గాంధీజీ కలలు గన్న మత సామరస్యం,ఆర్థిక సమానత్వం, నీతివంతమైన రాజకీయ వ్యవస్థ వంటివి ప్రస్తుత పాలకవర్గ పార్టీల వల్ల సాధ్యం కాదని 75 సంవత్సరాల చరిత్రలో తెలిసిపోయిందని సిపిఐఎంఎల్ సెక్రటరీ సుభాషన్న పేర్కొన్నారు.
ఎన్ని ప్రభుత్వాలు ఎన్నిసార్లు మారినా దేశం మరింత ఆర్థిక,సామాజిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నదే తప్ప మెరుగు కావడం లేదు.అందువలన అర్థిక,సామాజిక దోపిడీలకు గురవుతున్న ప్రజానీకాన్ని ఐక్యపరచి, కులం,మతం,జాతి,భాషల పేరిట మనిషిని మనిషి దోచుకోని అసమానతలు లేని అభ్యుదయ సామ్యవాద సమాజాన్ని నిర్మించుకోవడమే గాంధీజీకి భారత పౌరులు ఇచ్చే నిజమైన నివాళిగా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 పేర్కొన్నారు.
భారతదేశానికి నిరసనలు,నిరాహార దీక్షలు,ధర్నాలు, రాస్తారోకులు, సభలు,సమావేశాలు లాంటి శాంతియుత ప్రజాస్వామ్యక పోరాట రూపాలకు గాంధీజీ నిజమైన గురువు లాంటివాడని సుభాషన్న కొనియాడారు.గాంధీ నేర్పిన ఆనాటి అనేకనేక అహింసాయుత ప్రజాస్వామిక పోరాటా స్ఫూర్తి ఈ దేశంలో ఈనాటికి కొనసాగుతుందని గాంధీజీ పోరాట వారసత్వమే కమ్యూనిస్టులు నిరంతరం పుణికిపుచ్చుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
అన్ని రకాల మతోన్మాద ఉగ్రవాద కార్యక్రమాలను ఈ దేశం నుండి తరిమికొట్టి,నూతన భారతదేశంలో మనిషిని మనిషిగా ప్రేమించే సమాజాన్ని నిర్మించడమే లౌకిక వామపక్ష ప్రజాతంత్ర శక్తుల కర్తవ్యమే గాంధీజీకి సమర్పించే ఘన నివాళిగా కామ్రేడ్ బోసన్న 8328277285 పేర్కొన్నారు.కుల నిర్మూలన, మతసామరస్యం,సామాజిక పరివర్తన కోసం బోరన్నగారి సుభాషన్న బాటలో గాంధీజీని మరింతగా అధ్యయనం చేయాలని అన్ని కమ్యూనిస్టు నక్సలైట్ విప్లవ పార్టీలను బలహీన వర్గాల రాజ్యాధికార సమితి (బి.వి.ఆర్.ఎస్.) అధ్యక్షులు బి.వి.ఆర్.మహాత్మా గాంధీజీ కోరారు.దేశానికి మంచుకు వస్తున్న మతోన్మాద ఫాసిస్టు ప్రమాదం నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనడం కోసం దేశాన్ని రక్షించుకోవడం కోసం గాంధీజీ బోధనలను ప్రజలను ఓటర్లను చైతన్యం చేయాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి బి.జె.ఆర్.ఎస్.ప్రెసిడెంట్ బి.జె.ఆర్.సర్దార్ పటేల్ పేర్కొన్నారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy