గందరగోళంగా... ప్రజాపాలన దరఖాస్తుల వ్యవహారం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా ఆరు గ్యారెంటీ( Six guarantees )ల అమలకు గురువారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది.

తొలి రోజు నుండే దరఖాస్తులు ఇవ్వడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.అయితే అన్ని రకాల పథకాలకు ఓకే దరఖాస్తు ఫారం ఇవ్వడం, దానికి కేవలం ఆధార్,రేషన్ కార్డుల( Aadhaar, ration cards ) జీరాక్స్ మాత్రమే జత చేయమని చెప్పడంతో అందరూ అలాగే చేశారు.

Confusingly… The Matter Of Public Administration Applications-గందరగ�

కానీ, దరఖాస్తు ఫారంలో బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ లేకపోవడం, దానికి బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ జత చేయమని చెప్పకపోవడంతో కొన్ని పథకాలకు నగదు బదిలీ వ్యవహారం ఎలా చేస్తారనేఅనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే దరఖాస్తుల స్వీకరణ అనంతరం వెరిఫికేషన్ లో అయిన తర్వాత ఎవరు దేనికి అర్హులో నిర్ణయం జరిగాక వారికి సంబంధించిన అకౌంట్ వివరాలు సేకరించి అవకాశం ఉందని ప్రజలే మాట్లాడుకుంటున్నారు.

ప్రజల అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Latest Nalgonda News