ఏపీ మంత్రుల్లో దడ దడ ? ఆ నిర్ణయం వాయిదా వేస్తారా ?

అసలు జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? ఎలా తీసుకుంటారు అనే విషయంపై ఏపీ మంత్రుల్లో ఆందోళన నెలకొంది.ముఖ్యంగా ఏపీ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.

 Ys Jagan Decision About Cabinet Changes, Cabinet Ministers, Ap Ministers, Ap Cab-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పించాలి ? వారి స్థానంలో పార్టీకి, తనకు వీర విధేయులు ఎవరు ? ఎవరిని తీసుకుంటే తనకు కలిసివస్తుంది అనే విషయాలపై జగన్ కొద్దిరోజులుగా ఆలోచన చేస్తూనే ఉన్నారు.ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు , మంత్రుల పనితీరుపైన జగన్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.

మరో రెండు మూడు నెలల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగానూ కసరత్తు చేస్తున్నారు.
ఇదే ఏపీ మంత్రుల్లో ఆందోళన పెంచుతుంది.

తాము మంత్రి పదవిని తీసుకున్నా పూర్తిస్థాయిలో పని చేసేందుకు అవకాశం ఏర్పడలేదని, ఇప్పుడు విస్తరణలో తమ పదవులు పోతే తమ పరిస్థితి దారుణంగా తయారవుతుంది అనేది వారి వాదన.ఇటీవల ఓ సమావేశంలో ఈ విషయంపైనే మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తన స్థానంలో ఎవరిని తీసుకుంటారు అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది సందేహాలు వ్యక్తం చేయగా,  దీనిపై స్పందించిన మరో మంత్రి అందరూ సైలెంట్ గా ఉండాలని , జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరు చెప్పలేమని , అసలు క్యాబినెట్ లో మార్పులు ఉండకపోవచ్చు అంటూ సదరు మంత్రి మాట్లాడారట.

Telugu Ap, Ap Cm Jagan, Ap Ministers, Ministers, Jagan, Mlas, Ycp Senior, Ys Jag

 ఇక జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేయించుకున్న మరో మంత్రి స్పందిస్తూ,  అసలు క్యాబినెట్ లో మార్పు చేర్పుల గురించి ఎవరు మాట్లాడవద్దని, ఈ వ్యవహారంపై కొంతమంది మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని, ఎవరు ఎన్ని రకాలుగా లాబీయింగ్ చేసినా, జగన్ అవి పట్టించుకోరని తాను అనుకున్న వారికి మంత్రి పదవులు కట్టబెడతారు అంటూ వ్యాఖ్యానించినట్టు సమాచారం.తాత్కాలికంగా మంత్రి మండలి లో మార్పుచేర్పుల విషయాన్ని జగన్ పక్కన పెట్టినా, తప్పకుండా 90 శాతం మంది ని మార్చే తీరుతారు అనే విషయం మంత్రులను కలవరానికి గురి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube