ఆన్లైన్ ఆటలపై సమగ్ర నియంత్రణ చట్టం తేవాలి:జేఎస్ఆర్ విజ్ఞప్తి

నల్లగొండ జిల్లా:కొద్ది రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలో అయిదేళ్లు,మూడేళ్ల వయసు కలిగిన కన్నబిడ్డలిద్దరినీ చంపేసి, ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు.

ఏడాది కాలంగా ఓ ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఎనిమిది లక్షల రూపాయల వరకు నష్టపోయిందామె.

బందుమిత్రుల దగ్గర అప్పుతెచ్చిన సొమ్మును ఆటలో పోగొట్టుకోవడం, రుణదాతల ఒత్తిడి పెరగడంతో పిల్లల ఉసురుతీసి తానూ కడతేరిపోయిందని ప్రజాతంత్ర ఉద్యమకారుడు, సంఘసంస్కర్త కామ్రేడ్ జేఎస్ఆర్ నేతాజీ( JSR Netaji ) ఆవేదన వ్యక్తం చేశారు.కృష్ణాజిల్లాకు చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసగా మారి, చేసిన అప్పులను తీర్చే దారిలేక ఇటీవలే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ బీటెక్ విద్యార్ధి,హనుమకొండ జిల్లా మల్లకపల్లిలో మరో ప్రైవేట్ ఉద్యోగి ఇలాగే ఆన్లైన్లో బెట్టింగ్ కాసి ఆఖరికి ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు.ఆన్లైన్ ఆటల( Online games ) అరాచక ఆగడాలకు అంతులేకుండా పోతున్నాయని,ఈ మధ్య కాలంలో ఇటువంటివారి విషాదగాథలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా చిన్నారులు,యువతీ, యువకులెందరో డబ్బులొడ్డి ఆన్లైన్లో ఆటలాడుతూ జీవితాలను చేజేతులా ఛిద్రం చేసుకుంటున్నారని,ఆ వ్యసనం బారినపడిన వారిలో చాలామంది దొంగతనాలు,హత్యలకూ వెనకాడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.సామాజిక ఆరోగ్యానికి చీడపురుగులుగా పరిణమించిన ఆన్లైన్ జూదక్రీడలను కఠినంగా కట్టడి చేసితీరాలనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జనం మనిషి జేఎస్ఆర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

ఆన్లైన్ ఆటలు, రేసుకోర్సులు,కేసినోల్లో పూర్తి పందెం విలువపై 28 శాతం వస్తు సేవల పన్ను విధింపునకు జీఎస్టీ కౌన్సిల్ మొన్న నిశ్చయించిందని, ఆన్లైన్ గేమింగ్ మాయలో యువత చిక్కుపడకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.మద్యం ధరలను పెంచితే తాగేవారు తగ్గిపోతారనుకోవడం ఎంత అసంబద్ధమో,ఆన్లైన్ గేమ్లపై జిఎస్టి మరియు అదనపు చార్జీలు విధించడం అంతేనని,ధూమపాన నియంత్రణలో పన్నుల పెంపు అస్త్రం విఫలమవుతోందన్నదీ అందరికీ తెలిసిందేనని స్పష్టమైన నిర్వచనాలతో కూడిన పటిష్ట శాసనం, జూద పర్యవసానాలపై విస్తృత ప్రచారం ద్వారానే ఆన్లైన్ మృత్యుక్రీడలను అడ్డుకోగలమని తెలిపారు.కొవిడ్ పుణ్యమా అని అందరూ ఇళ్లకే పరిమితమైన దరిమిలా సెల్ఫోన్లలో క్రీడాకాలక్షేపానికి అలవాటు పడినవారు దేశీయంగా విపరీతంగా పెరిగారని,2018లో పాతిక కోట్లుగా ఉన్న భారతీయ ఆన్లైన్ గేమర్ల సంఖ్య ప్రస్తుతం 50.7 కోట్లకు చేరిందని,అందులో డబ్బులు ధారపోసి ఆడుతున్నవారు 24 కోట్ల మంది వరకు ఉండవచ్చన్నది భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ అంచనా! పదిహేను వందల కోట్ల డౌన్లోడ్లతో నిరుడు మొబైల్ ఆటలకు ఇండియా అతి పెద్ద విపణి అయ్యిందన్నారు.ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు గతేడాది దేశీయంగా 30 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయని 2025 నాటికి అవి 50వేల కోట్ల రూపాయలకు పైగా సంపాదనను కళ్ల జూస్తాయన్నది జన చైతన్య శ్రామిక రాజ్యం మరియు భారతీయ జనతా రాజ్యాధికారం అధ్యయనాల సారాంశం.

అతివేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యచరణ రూపొందించాలని,ప్రత్యేక నిబంధనలను నోటిఫై చేయాలని,డబ్బుతో ముడివడిన ఆటలపై పర్యవేక్షణకు పరిశ్రమ ప్రతినిధులు,విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణులు, బాలలహక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నవారి భాగస్వామ్యంతో స్వీయనియంత్రిత సంస్థల ఏర్పాటుకు బాటలు వేయాలని కమ్యూనిస్టు విప్లవకారుడు ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ డిమాండ్ చేశారు.ప్రాణాంతక జూదక్రీడలకు కళ్లెం వేయాలని,ఒక్కసారి అలవాటైతే అంత తేలిగ్గా విడిచిపెట్టలేని ఆన్లైన్ గేమ్ల మత్తులో పిల్లలు కూరుకుపోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు.

వినియోగదారులను ప్రాణాంతక బెట్టింగ్ల రొంపిలోకి దింపే వారి మానసిక,శారీరక ఆరోగ్యానికి హాని కారకమైన ఆటలపై పూర్తి నిషేధాన్ని అమలు చేయాలనీ ప్రధానమంత్రికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన బహిరంగ లేఖలో బాధితుల బంధువు బహుజన నేస్తం, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ ( CPI(ML) )సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్ నేతాజీ విజ్ఞప్తి చేశారు.ప్రజాభద్రత రీత్యా అది ప్రభుత్వాల విధ్యుక్త ధర్మం అని జేఎస్ఆర్9848540078 పేర్కొన్నారు.

ఆ సినిమాలో వైష్ణవి చైతన్యను బ్యాడ్ గా చూపిస్తారట.. అలాంటి బూతులు మాట్లాడుతుందా?
Advertisement

Latest Nalgonda News