అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సిఎస్ శాంతి కుమారి

నల్లగొండ జిల్లా: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈ నెల 17 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.ప్రజాపాలన నిర్వహణ,దరఖాస్తుల డాటా ఎంట్రీలపై కలెక్టర్లతో ఈరోజు టెలీకాన్ఫ రెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామసభలను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడంపై కలెక్టర్లను సీఎస్‌ అభినందించారు.6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు.మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్‌మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని,ప్రజాపాలన కార్యక్రమం సూపర్‌వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలిపారు.ఈ డాటా ఎంట్రీ చేపట్టేందుకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రస్థాయిలో ట్రెయినీ ఆఫ్ ట్రైనర్ (TOT )లకు 4న శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,ఈ టీఓటీలకు జిల్లాస్థాయిలో డాటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలని,ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్,వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలని ఆదేశించారు.

నిన్నటి వరకు దాదాపు 57లక్షల దరఖాస్తులు అందాయని, ప్రతీ నాలుగు నెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.దరఖాస్తులు ఇవ్వనివారు తిరిగి దరఖాస్తులు అందజేయవచ్చన్నారు.టెలీకాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా,జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయితీ రాజ్ కమిషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

Latest Nalgonda News